అగ్ని ప్ర‌మాద బాధిత కుటుంబాల‌ను ఆదుకోవాలి

ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

క‌రీంన‌గ‌ర్ జిల్లా : బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఆదివారం క‌రీంన‌గ‌ర్ జిల్లా హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఈతవనం, తాటివనం పూర్తిగా దగ్ధమై గౌడ సోదరులు తీవ్రంగా నష్టపోయిన ఘటనపై ఆరా తీశారు. ఈ సంద‌ర్బంగా ఇవాళ ఎమ్మెల్యే సంఘటన స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలతో మాట్లాడిన ఎమ్మెల్యే జరిగిన నష్టంపై ఆవేదన వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదం కారణంగా జీవనాధారం కోల్పోయిన గౌడ కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

బాధితులకు తక్షణ నష్టపరిహారం అందించాలంటూ జిల్లా కలెక్ట‌ర్ తో ఎమ్మెల్యే ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని వివరించారు. అలాగే ఎక్సైజ్ సీఐ తో కూడా మాట్లాడి సంబంధిత శాఖల ద్వారా బాధిత కుటుంబాలకు వెంటనే సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి గౌడ సోదరులకు తగిన ఆర్థిక సహాయం అందించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, వారికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *