జూన్‌ నెల‌లో శ్రీ‌వారి విశేష ప‌ర్వ‌దినాలు

29వ తేదీన పౌర్ణ‌మి గ‌రుడ సేవ

తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. వ‌చ్చే జూన్ నెల‌లో తిరుమ‌ల‌లోని శ్రీ వేంక‌టేశ్వ‌ర ఆల‌యంలో విశేష ప‌ర్వ‌దినాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. ఇందులో భాగంగా భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు పేర్కొంది టీటీడీ. ఇదిలా ఉండ‌గా జూన్ నెల‌లో తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో నిర్వ‌హించే విశేష ప‌ర్వ‌దినాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

ప‌ర్వ‌దినాల‌లో భాగంగా జూన్ 11వ తేదీన స‌ర్వ ఏకాద‌శి నిర్వ‌హించ‌నున్నారు. 13న మాస శివ‌రాత్రి, 26న
శ్రీ‌వారి జ్యేష్టాభిషేకం ప్రారంభం జ‌రుగుతుంద‌ని తెలిపింది టీటీడీ. జూన్ 27న శ్రీ నాధ‌మునుల వ‌ర్ష తిరు న‌క్ష‌త్రం ఉంటుంద‌ని, 28న శ్రీ‌వారి జ్యేష్టాభిషేకం స‌మాప్తం అవుతుంద‌ని పేర్కొంది. ఇదిలా ఉండ‌గా అత్యంత విశిష్ట‌మైన ప‌ర్వ‌దినంగా జూన్ 29న పౌర్ణ‌మి గ‌రుడ సేవ జ‌రుగుతుంద‌ని వెల్ల‌డించింది. ఇక వేస‌వి సెల‌వులు కావ‌డంతో పెద్ద ఎత్తున భ‌క్తులు త‌ర‌లి వ‌స్తున్నారు తిరుమ‌ల క్షేత్రానికి. దీంతో ముందు జాగ్ర‌త్త‌గా జూలై 15 వ‌ర‌కు బ్రేక్ ద‌ర్శ‌నానికి సంబంధించి సిఫార‌సు లెట‌ర్లు ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

  • Related Posts

    శ్రీ‌వారి ఉద్యోగులకు వెండి డాలర్‌, ప్రశంసా పత్రాలు

    తిరుపతి : తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్‌ మైదానంలో టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. భద్రతా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ…

    ఆగ‌స్టు 17 నుంచి ఆధ్యాత్మిక సేవ‌ల‌పై జాతీయ స‌ద‌స్సు

    తిరుపతి : తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. శ్రీ రామానుజులు, ఆచార్య పుండరీకాక్షులు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *