ఢిల్లీకి బ‌య‌లు దేరిన సీఎం జోసెఫ్ విజ‌య్

ప్ర‌ధానితో పాటు సోనియా, రాహుల్ తో భేటీ

చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్ర ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ బుధ‌వారం ఢిల్లీకి బ‌య‌లుదేరి వెళ్లారు. ఆయ‌న సీఎంగా కొలువు తీరిన త‌ర్వాత తొలిసారిగా దేశ రాజ‌ధానికి వెళ్ల‌డం. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా జోసెఫ్ విజ‌య్ సంచ‌ల‌నం సృష్టించారు. ఆయ‌న కేవ‌లం పార్టీ పెట్టిన 2 సంవ‌త్స‌రాల కాల వ్య‌వ‌ధిలో రాష్ట్రంలో అత్య‌ధిక మెజారిటీ సీట్ల‌ను సాధించి చ‌రిత్ర సృష్టించారు. ప‌లు పార్టీల మ‌ద్ద‌తుతో క‌లిసి కొత్త‌గా టీవీకే ఆధ్వ‌ర్యంలో కూట‌మి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆయ‌న సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటూ పాల‌నా ప‌రంగా త‌న‌దైన ముద్ర వేశారు. వ‌చ్చీ రావ‌డంతోనే అక్ర‌మార్కుల‌కు చెక్ పెట్టారు. ప్ర‌ధానంగా ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యం రాష్ట్ర వ్యాప్తంగా మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. ప్రార్థ‌నా మందిరాళ్లు, ఆల‌యాలు, స్కూళ్ల‌కు కిలో మీట‌ర్ దూరంలో మ‌ద్యం షాపులు ఉండాల‌ని ఆదేశించారు.

అంతే కాదు మాద‌క ద్ర‌వ్యాల ప‌ట్ల కూడా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించారు. ఇదే స‌మ‌యంలో అత్యంత కీల‌క‌మైన ఇంటెలిజెన్స్ శాఖ‌కు అత్యంత నిజాయితీ, నిబ‌ద్ద‌త క‌లిగిన , పేరు మోసిన సీనియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ ఆస్రా గార్గ్ ను చీఫ్ గా నియ‌మించారు. అంతే కాదు గ‌త ప్ర‌భుత్వంలో అవినీతి అక్ర‌మాల‌కు తెర లేపిన సెంథిల్ బాలాజీ పై విచార‌ణ‌కు ఆదేశించారు. అవినీతి ర‌హిత పాల‌న అందిస్తాన‌ని ప్ర‌క‌టించారు. అంతే కాదు అంద‌రికంటే ముందుగా స‌చివాల‌యానికి వ‌స్తున్నారు. దీంతో ఉద్యోగుల‌లో కూడా ద‌డ పుడుతోంది. ఇక ఆయ‌న ఢిల్లీలో ప్ర‌ధాని మోదీతో భేటీ అవుతారు. అనంత‌రం కాంగ్రెస్ అగ్ర నాయ‌కులు సోనియా, ఖ‌ర్గే, రాహుల్ , ప్రియాంక గాంధీల‌తో స‌మావేశం కానున్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *