క‌ర్ణాట‌క‌లో రాజ‌కీయ సంక్షోభం : స‌దానంద గౌడ‌

సిద్ద‌రామ‌య్య‌, డీకే శివ‌కుమార్ ల మ‌ధ్య వార్

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క‌లో రాజ‌కీయం ర‌స‌కందాయ‌కంగా మారింది. నిన్న‌టి దాకా ఊరిస్తూ వ‌చ్చిన ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇప్పుడు ఎవ‌రిని వ‌రిస్తుంద‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. కాంగ్రెస్ హైక‌మాండ్ ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ప్ర‌స్తుతం రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఉన్న సిద్ద‌రామ‌య్య‌ను త‌ప్పించింది. త‌న‌ను రాజీనామా చేయాల‌ని కోరింది. ఇది ఎవ‌రూ ఊహించ‌ని ప‌రిణామం. గ‌త కొంత కాలంగా ఆధిపత్య పోరు కొన‌సాగుతూ వ‌స్తోంది సీఎం, డిప్యూటీ సీఎంల మ‌ధ్య‌. దీంతో చివ‌ర‌కు గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో డీకే శివ‌కుమార్ కు ముఖ్య‌మంత్రి ప‌గ్గాలు అప్పించింది పార్టీ అధిష్టానం. ఇదిలా ఉండ‌గా ఈ మొత్తం వ్య‌వ‌హారంపై స్పందించారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు డి. వి. సదానంద గౌడ .

గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. .అన్నీ సజావుగా సాగడం లేదు. కేంద్ర నాయకులు, సిద్ధరామయ్య, డి.కె. శివకుమార్ మధ్య సుదీర్ఘ చర్చలు జరిగినప్పటికీ, వారు తీసుకున్న నిర్ణయం స్పష్టంగా తెలియ జేయబడలేదని అన్నారు. అయితే, సిద్ధరామయ్య ఈ రోజే రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. దురదృష్టవశాత్తు, వ్యక్తిగత కారణాల రీత్యా గవర్నర్ తన స్వస్థలానికి వెళ్లడంతో ఆయన ప్రస్తుతం అందుబాటులో లేరన్నారు స‌దానంద గౌడ‌. ఈ అధికార మార్పిడి ప్రక్రియలో ఏదో తేడా ఉన్నట్లు అనిపిస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రి పదవిని డి.కె. శివకుమార్‌కు అప్పగించే ప్రక్రియ సజావుగా సాగడం లేదని అనుమానం వ్య‌క్తం చేశారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *