జూన్ 4 ఆన్ లైన్ లో వస్త్రాలు ఈ -వేలం

VijayaBhaskar · May 29, 2026
Spread the love

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన తిరుమ‌ల దేవ‌స్థానం

తిరుప‌తి : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. భ‌క్త బాంధ‌వుల‌కు తీపి క‌బురు చెప్పింది. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలు కొత్తవి / ఉపయోగించినవి / పాక్షికంగా దెబ్బ తిన్నవి 147 లాట్ల వస్త్రాలతో పాటు న్యూ ఆర్ట్ సిల్క్ శారీస్ , సిల్క్ శారీస్ ను వేలం వేయ‌నున్న‌ట్లు తెలిపింది. ఈ వేలం పాట వచ్చే నెల జూన్ 4వ తేదీ నుంచి 6వ తేదీ వ‌ర‌కు జ‌రుగుతుంద‌ని వెల్ల‌డించింది.

ఇదిలా ఉండ‌గా టిటిడి ఆన్ లైన్ లో EA ID Nos 25918 to 25923 ద్వారా ఈ వేలం వేయనున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ – కొనుగోలు పోర్టల్ లో రిజిస్టర్ అయిన ఆసక్తి కల్గిన బిడ్డర్లు వస్త్రాల ఆన్ లైన్ వేలంలో పాల్గొనటానికి అర్హులు అని వెల్ల‌డించింది. ఇతర వివరాలకు స్థానిక జనరల్ మేనేజర్ (వేలములు) / ఏఈఓ (వేలములు), టిటిడి, హరేకృష్ణ మార్గ్ , తిరుపతిలో https://konugolu.ap.gov.in లేదా టిటిడి వెబ్ సైట్ www.tirumala.org లేదా 0877 – 2264429 ఫోన్ నెంబర్ ద్వారా గాని సంప్రదించాల‌ని సూచ‌చించింది.