ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్సీ నుంచి పాండ్యా ఔట్ ..?

ఐపీఎల్ 2026 సీజన్ లో పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న

ముంబై : రిల‌య‌న్స్ గ్రూప్ న‌కు చెందిన ముంబై ఇండియ‌న్స్ ఈసారి జ‌రిగిన ఐపీఎల్ 19వ సీజ‌న్ లో దారుణ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో ఆఖ‌రు స్థానంలో నిలిచింది. ప్ర‌ధానంగా అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో , ఫీల్డింగ్ లో అన్ని విభాగాల‌లో చేతులెత్తేసింది. ప్ర‌ధానంగా రోహిత్ శ‌ర్మ త‌ర్వాత ఏరికోరి ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్యాకు కీల‌క‌మైన ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్సీ బాధ్య‌త‌లు అప్ప‌గించింది. అయితే త‌ను ఆశించిన మేర ఆడ‌లేక పోయాడు. త‌ను ఆడ‌లేదు స‌రిక‌దా జ‌ట్టును కూడా విజ‌యం వైపు న‌డిపించడంలో ఘోరంగా విఫలం అయ్యాడు.

దీంతో హెడ్ కోచ్ తో పాటు ప‌లువురు సీనియ‌ర్ ఆట‌గాళ్ల‌పై వేటు వేసేందుకు ముండి ఇండియ‌న్స్ జ‌ట్టు యాజామ‌న్యం రెడీ అయ్యిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక కెప్టెన్‌గా, ఆటగాడిగా హార్దిక్ పాండ్యా ప్రదర్శన పట్ల ముంబై ఇండియన్స్ అసంతృప్తిగా ఉంది . దాదాపుగా హార్దిక్ పాండ్యాను జట్టు నుండి తొలగించడానికి MI సిద్ధమైంది. ఇదే స‌మ‌యంలో అంతేకాకుండా, క్రమశిక్షణా లోపాల విషయంలో ముంబై ఇండియన్స్ కొంతమంది సీనియర్ ఆటగాళ్లను హెచ్చరించింది. లేదంటే IPL 2027 వేలానికి ముందే వారిని జట్టు నుండి విడుదల చేసే అవకాశం ఉంద‌ని టాక్.

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *