పవన్ కళ్యాణ్ ఫ‌క్తు ప్యాకేజ్ స్టార్ : అనిరుధ్ రెడ్డి

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

పాల‌మూరు జిల్లా : అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌నుంప‌ల్లి అనిరుధ్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఏకి పారేశారు. త‌న‌కు అంత సీన్ లేద‌న్నారు. తెలంగాణ వాళ్ల‌తో పెట్టుకుంటే బాగుండ‌ద‌ని హెచ్చ‌రించారు. ఏపీలో ఉండాలే త‌ప్పా ఇక్క‌డ రాజకీయాలు చేస్తామంటే చూస్తూ ఊరుకోమ‌న్నారు. రేపు జగన్ గనుక ఇంకా పెద్ద ప్యాకేజీని ఆఫర్ చేస్తే, ఆయన జగన్‌కే మద్దతు ఇస్తారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు అనిరుధ్ రెడ్డి. ప్రొఫెసర్ నాగేశ్వర్ రావును విమర్శించే అర్హత పవన్ కళ్యాణ్‌కు లేదన్నారు.

మీకు దమ్ముంటే, తెలంగాణకు వచ్చి ప్రొఫెసర్ నాగేశ్వర్ రావును అరెస్టు చేయాల‌ని స‌వాల్ విసిరారు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. నేను ఆయన ఇంటి ముందు నిలబడతానని ప్ర‌క‌టించారు. ఆంధ్ర నుండి ఎవరైనా వచ్చి తెలంగాణ బిడ్డలను తాకడానికి ప్రయత్నిస్తే, ‘గో బ్యాక్ ఆంధ్ర’ ఉద్యమం మొదలవుతుందని హెచ్చ‌రించారు. అయినా, మీరందరూ హైదరాబాద్‌లోనే కదా ఉంటున్నారు? మీ డబ్బునంతా వెచ్చించి అమరావతిని ఎందుకు నిర్మిస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. తాజాగా ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *