యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు

ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి శివశంకర్ లోతేటి వెల్లడి

తిరుపతి : ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని నెల్లూరు, కడప జిల్లాల్లో రాత్రి బలమైన గాలి, వర్షం కారణంగా పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ఒక ప్రకటనలో తెలిపారు. కడప జిల్లాలోని కొండాపురం, మైదుకూరు, మైలవరం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు గ్రామీణ, దువ్వూరు, రాజుపాలెం, చాపాడు మండలాల్లోని 28 గ్రామాల్లోనూ, నెల్లూరు జిల్లాలోని కావలి గ్రామీణ, కొండాపురం, కోవూరు, ముత్తుకూరు, జలదంకి, దగదర్తి, అల్లూరు మండలాల్లోని 15 గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని తెలియజేశారు.

బలమైన గాలి, వర్షం కారణంగా ఈ రెండు జిల్లాల్లో 26 ఫీడర్లు, 114 కి.మీ. మేరకు విద్యుత్ లైన్లు, 213 స్తంభాలు, 131 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయన్నారు శివ శంక‌ర్ లోతేటి. తద్వారా ఈ రెండు జిల్లాల్లో 19 మండలాలల్లోని 35 గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడగా, ఆయా సర్కిళ్ల సూపరింటెండింగ్ ఇంజనీర్ల పర్యవేక్షణలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది శుక్రవారం మధ్యాహ్నానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు తెలిపారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *