భ‌క్తుల‌తో కిట కిట లాడుతున్న కేదార్ నాథ్ యాత్ర

VijayaBhaskar · May 31, 2026
Spread the love

గంట‌ల త‌ర‌బ‌డి వాహ‌నాల్లోనే తిష్ట వేసిన భ‌క్తులు

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ : చార్ ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తారు. బద్రీనాథ్.. కేదార్ నాథ్ ఆలయ మార్గాలు భ‌క్త బాంధ‌వుల‌తో కిటకిట లాడుతున్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ తో దారిలోనే యాత్రికులు పడిగాపులు కాయల్సి వస్తోంది. గమ్యస్థానం ఎప్పుడు చేరతామో.. దైవాన్ని ఎప్పుడూ దర్శించుకుంటామో తెలియని స్థితిలో ఆందోళన చెందుతున్నారు సుదూర ప్రాంతాల నుంచి వ‌చ్చిన వారు.

కేదార్ నాథ్ నడక మార్గంలో అడుగు వేయడానికి కూడా లేనంత రద్దీ నెలకొంది. ఇక బద్రీనాథ్ కు వెళ్లే మార్గంలో జోషీ మఠ్ వద్ద దాదాపు ముప్పై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి పోయాయి. యాత్రికులు గంటల తరబడి వాహనాల్లో గడపాల్సి వస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కాగా పర్యాటకుల రద్దీని ప్రభుత్వం మరింత పకడ్బందీగా కంట్రోల్ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
అలాగే కొత్తగా యాత్రకు రావాలనుకునే వారు ప్రయాణాలను రద్దు చేసుకోవాలని అవస్థలు పడుతున్న భక్తులు సూచిస్తున్నారు.