ఆధునిక వ‌స‌తుల‌తో ల‌డ్డూ త‌యారీ వంట‌శాల‌

మే నెల‌లో 1.21 ల‌క్ష‌ల ల‌డ్డూల విక్ర‌యాల‌తో రికార్డ్

తిరుమ‌ల : టీటీడీ రికార్డ్ స్తాయిలో గ‌త మే నెల‌లో ల‌డ్డూల‌ను విక్ర‌యించింది. గ‌తంలో కంటే ఈ ఏడాది 2026లోనే అత్య‌ధికంగా శ్రీ‌వారి భ‌క్తుల‌కు అంద‌జేసిన‌ట్లు తెలిపింది టీటీడీ. ఈ మేర‌కు అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇక మారుతున్న కాలానికి అనుగుణంగా టీటీడీ శ్రీ‌వారి ల‌డ్డూ త‌యారీకి సంబంధించి వంట‌శాల‌ను ఆధునిక వ‌స‌తి సౌక‌ర్యాల‌తో ఏర్పాటు చేసింది. పోటు’ అనేది తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర ఆలయానికి సంబంధించిన పవిత్రమైన, అత్యంత గౌరవనీయమైన ప్రధాన వంటశాల. ఇక్కడే ప్రసిద్ధ శ్రీవారి లడ్డూ, ఇతర పవిత్ర నైవేద్యాలను ప్రతిరోజూ తయారు చేస్తారు.

శ్రీవారి పోటులో సుమారు 700 మంది శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు రెండు షిఫ్టులలో పని చేస్తున్నారు. పిండి మర (Flour mill): రోజుకు 15 టన్నుల శనగపిండి తయారీ సామర్థ్యం క‌లిగి ఉంది. 2,10,000 కిలోల సామర్థ్యం క‌లిగిన నెయ్యి నిల్వ‌ల కేంద్రంతో పాటు 30 ట‌న్నులు క‌లిగిన గ్యాస్ ప్లాంట్ ఉన్నాయి. 2 నుండి 7 రోజుల వినియోగానికి సరిపడా ముడి పదార్థాలను నిల్వ చేసే గోదాములు క‌లిగి ఉంది వంట‌శాల‌.

లడ్డూ కాంప్లెక్స్‌లో లడ్డూల విక్రయం కోసం TTD ప్రస్తుతం 56 కౌంటర్లను మూడు షిఫ్టులలో, నిరంతరాయంగా (24 గంటలూ) నిర్వహిస్తోంది. సేవలను వేగవంతం చేయడానికి , పారదర్శకతను పెంపొందించడానికి, అదనపు లడ్డూలను కొనుగోలు చేసేందుకు వీలుగా డిజిటల్ చెల్లింపుల సదుపాయం కలిగిన కియోస్క్‌లను TTD ప్రారంభించింది. దర్శనంతో పాటు ప్రతి భక్తుడికి ఒక ఉచిత లడ్డు (సాధారణ రకం) అందిస్తోది.

  • Related Posts

    శ్రీ‌వారి ఉద్యోగులకు వెండి డాలర్‌, ప్రశంసా పత్రాలు

    తిరుపతి : తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్‌ మైదానంలో టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. భద్రతా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ…

    ఆగ‌స్టు 17 నుంచి ఆధ్యాత్మిక సేవ‌ల‌పై జాతీయ స‌ద‌స్సు

    తిరుపతి : తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. శ్రీ రామానుజులు, ఆచార్య పుండరీకాక్షులు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *