newsseals.com
News

ఐటీ కారిడార్‌లో ‘ఈగిల్ ఫోర్స్’ భారీ ఆపరేషన్

VijayaBhaskar June 11, 2026
newsseals-EagleForce
Spread the love

సమాచారం అందగానే పరారైన నీతూ భాయ్

హైద‌రాబాద్ : ఐటీ కారిడార్ లో భారీ ఆప‌రేష‌న్ చేపట్టింది ఈగిల్ ఫోర్స్ . ఈమేర‌కు పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకుంది. డ్రగ్ డాన్ ‘నీతూ భాయ్’ కోసం నానక్‌రామ్‌గూడలో ముమ్మర గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇదిలా ఉండ‌గా ఈగిల్ ఫోర్స్ రాకపై సమాచారం అందగానే పరారయ్యాడు నీతూ భాయ్. కిరాణా దుకాణం వెనుక నుంచి గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గంజాయి కొనుగోలుకు నీతూ భాయ్ ఇంటికి వచ్చిన 50 మంది ఐటీ ఉద్యోగులను అదుపులోకి తీసుకుంది ఈగిల్ ఫోర్స్

గతంలో పీడీ (PD) చట్టం కింద అరెస్టై జైలు నుంచి విడుదలైన నీతూ భాయ్ తిరిగి గంజాయి వ్యాపారాన్ని ప్రారంభించినట్లు సమాచారం అందుకుంది. రోజుకు రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్లు అధికారుల అనుమానం. అంటే దాదాపు కోటిన్న‌ర‌కు పైగానే దీని ద్వారా సంపాదిస్తున‌న్న‌ట్లు అంచ‌నా వేసింది. నీతూ బాయ్ ఎక్క‌డికి పారి పోయాడ‌నే దానిపై ఈగిల్స్ టీం సెర్చ్ ప్రారంభించింది. త‌న‌కు ఎక్క‌డి నుంచి గంజాయి పెద్ద మొత్తంలో అందుతోంద‌నే దానిపై విచార‌ణ చేప‌ట్టింది టీం.