ఏపీ, తెలంగాణ‌ రాష్ట్రాల్లో ఈడీ సోదాలు

హ‌వాలా, మ‌నీ లాండ‌రింగ్ ద్వారా నిధులు

హైద‌రాబాద్ : కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఏపీ మద్యం కుంభకోణం దర్యాప్తులో భాగంగా అటు ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌ రాష్ట్రాల్లో ఈడీ సోదాలు చేప‌ట్టింది. హవాలా , మనీ లాండరింగ్ ద్వారా నిధులు బదిలీ అయినట్లు ఈడీ గుర్తించింది. దేశ వ్యాప్తంగా ఏపీ లిక్క‌ర్ స్కాం క‌ల‌కలం రేపింది. ఆంధ్రప్రదేశ్‌లో వెలుగు చూసిన మద్యం కుంభకోణానికి సంబంధించి, రెండు తెలుగు రాష్ట్రాల్లోని 10కి పైగా ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు చేప‌ట్ట‌డం క‌ల‌క‌లం రేపింది.

గురువారం ఉదయం నుండి హైదరాబాద్‌లోని అరడజను ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ కుంభకోణంలో కీలక సూత్రధారి అయిన రాజ్ కేసీ రెడ్డి తో పాటు ఇందులో ప్రమేయం ఉన్న ఇతరుల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి. ఏపీ మద్యం కుంభకోణంలో వేల కోట్ల రూపాయల చేతులు మారాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు కొన‌సాగుతున్నాయి. హవాలా , మనీ లాండరింగ్ మార్గాల ద్వారా నిధులు బదిలీ అయినట్లు ఈడీ గుర్తించింది. ఇప్ప‌టికే లిక్క‌ర్ స్కాం లో ప‌లువురిని నిందితులుగా ఐడెంటిఫై చేసింది.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *