శ్రీవారి సేవలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

సాద‌ర స్వాగ‌తం ప‌లికిన టీటీడీ ఈవో ర‌విచంద్ర‌

తిరుమల : ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ శుక్రవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ఆమెకు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ ఆహ్వానించగా, అర్చకులు సాంప్రదాయ బద్ధంగా ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.

దర్శనానంతరం రంగ నాయకులు మండపం వద్ద ఆమెకు పండితులు వేదాశీర్వచనం అందించగా ఈవో, అదనపు ఈవో తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా ఇటీవ‌లే రాస్ట్ర గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్ కూడా తిరుమ‌ల పుణ్య క్షేత్రాన్ని సంద‌ర్శించారు. కాగా నిత్యం భ‌క్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ ఏడాది జ‌న‌వ‌రి 1 నుంచి మే 31వ తేదీ వ‌ర‌కు 4 కోట్ల మందికి పైగా భ‌క్త బాంధ‌వులు ద‌ర్శించుకున్నార‌ని టీటీడీ తెలిపింది. తిరుమ‌ల చ‌రిత్ర‌లో ఇది ఓ రికార్డ్ అని పేర్కొన్నారు ఈవో ర‌విచంద్ర‌.

  • Related Posts

    శ్రీ‌వారి ఉద్యోగులకు వెండి డాలర్‌, ప్రశంసా పత్రాలు

    తిరుపతి : తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్‌ మైదానంలో టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. భద్రతా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ…

    ఆగ‌స్టు 17 నుంచి ఆధ్యాత్మిక సేవ‌ల‌పై జాతీయ స‌ద‌స్సు

    తిరుపతి : తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. శ్రీ రామానుజులు, ఆచార్య పుండరీకాక్షులు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *