వైఎస్ ష‌ర్మిల‌కు హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్

తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేసిన నాయ‌కురాలు

విజ‌య‌వాడ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. తెలంగాణ‌లో త‌ను కొత్త‌గా పార్టీ పెట్టింది. ఆ త‌ర్వాత మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఉన్న‌ట్టుండి ఇక్క‌డ దుకాణం మూసేశారు. అక్క‌డి నుంచి పెద్ద‌ల సూచ‌న‌ల‌తో ఏపీకి వెళ్లారు. అక్క‌డ ఏపీపీసీసీ లో చేరారు. కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు. ఉన్న‌ట్టుండి ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో సీనియ‌ర్ నేత‌లు, దిగ్గ‌జ నాయ‌కుల‌ను కాద‌ని వైఎస్ ష‌ర్మిలా రెడ్డికి కీల‌క‌మైన‌, అత్యున్న‌త‌మైన ఏపీపీసీసీ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించింది. ఆ స‌మ‌యంలో ముఖ్య నేత‌లు త‌న‌కు రాజ్య‌స‌భ సీటు ఇస్తాన‌ని హామీ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

ఇదిలా ఉండ‌గా త‌నకు క‌ర్ణాట‌క రాష్ట్రం నుంచి ఛాన్స్ ఇస్తార‌ని భావించింది ష‌ర్మిలా రెడ్డి. కానీ తాజాగా జ‌రిగిన సీట్ల కేటాయింపు వ్య‌వ‌హారంలో ష‌ర్మిల‌కు బిగ్ హ్యాండ్ ఇచ్చింది. రాజ్యసభ సీటుపై మాట తప్పింది.షర్మిలకు కర్ణాటక నుండి రాజ్యసభ ఇస్తున్నట్లుగా కూడా అధిష్టానం.లీకులు ఇచ్చింది. తీరా చూస్తే ఆమెకు సీటు ఇవ్వలేదు. దీంతో తీవ్ర అసంతృప్తిలో షర్మిల ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంలో బీజేపీ వాళ్ళు షర్మిలను ఉద్దేశించి ట్విట్టర్ లో కామెంట్స్ చేశారు. సొంతపార్టీ పెద్దలను టార్గెట్ చేసిన షర్మిల.. బీజేపీ పేరుతో కాంగ్రెస్ పెద్దలకు కౌంటర్ ఇవ్వ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *