షబ్బీర్ అలీపై ఏఐసీసీ సీరియస్

నోటీస్ పంపిన క్రమశిక్షణ కమిటీ

న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ష‌బ్బీర్ అలీపై ఏఐసీసీ సీరియ‌స్ అయ్యింది. త‌న‌కు షోకాజ్ నోటీస్ పంపింది క్రమశిక్షణ కమిటీ. డబ్బులు ఇచ్చేవాళ్లకు పండబెట్టే వాళ్లకు పార్టీ ముఖ్యులు అమ్ముడు పోతున్నారని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ను ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేశారు షబ్బీర్ అలీ. ఈ సంద‌ర్బంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు కాంగ్రెస్ పార్టీలో క‌ల‌క‌లం రేపాయి. దీనిపై తీవ్రంగా స్పందించారు తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి భార్య . ఆయ‌న‌పై ఏఐసీసీకి ఫిర్యాదు కూడా చేశారు.

మహిళలను కించపరిచేలా ఆరోపణలు చేసిన అంశంపై కాంగ్రెస్ పెద్దలు సీరియ‌స్ అయ్యారు. అయితే ఈ విషయంలో షబ్బీర్ అలీ కూడా గట్టిగానే ఉన్నట్లు స‌మాచారం. ష‌బ్బీర్ అలీ ముందు నుంచీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. త‌నకంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ కూడా ఉంది. అంతే కాదు గ‌తంలో తాను ప‌లు కీల‌క ప‌ద‌వులు నిర్వ‌హించారు. పార్టీలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గ్రూప్ కూడా ఉంది. ఈ స‌మ‌యంలో ష‌బ్బీర్ అలీ చేసిన కామెంట్స్ పై ఏఐసీసీ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుంద‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

  • Related Posts

    వ్య‌వ‌సాయ రంగానికి బ‌డ్జెట్ లో ప్రాధాన్య‌త

    చెన్నై : త‌మిళ‌నాడు స‌ర్కార్ వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంది. ఇందులో భాగంగా సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ అధ్యక్ష‌త‌న కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వరి, చెరకు పంటలకు కనీస మద్దతు ధర పెంపుపై ప్రధానంగా చర్చించ‌నున్నారు. ఇవాళ జోసెఫ్…

    రైతుల‌కు రూ. 300 కోట్ల వార్షిక బ‌కాయిల చెల్లింపు

    అమ‌రావ‌తి : ఏపీ పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సీఎం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన సీఆర్డీఏ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలిపారు. పలు ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపార‌న్నారు. ఆలస్యం కారణంగా గృహ కొనుగోలుదారులు అదనపు ఆర్థిక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *