జ‌గ‌న్ రెడ్డి అంటే చంద్ర‌బాబుకు భ‌యం

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కొడాలి నాని

విజ‌య‌వాడ : మాజీ మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు. ఏపీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు, ఆయ‌న కొడుకు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ల‌ను ఏకి పారేశారు. కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా మాజీ సీఎం , త‌మ పార్టీ అధినాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అంటే తండ్రీ కొడుకుల‌కు చ‌చ్చేంత భ‌యం అంటూ ఎద్దేవా చేశారు. ఆ ఇద్ద‌రికీ జ‌గ‌న్ గొడ్డ‌లిగా క‌నిపించ‌డంలో త‌ప్పు లేద‌న్నారు.

చంద్రబాబుకు జగన్ సరిగ్గా ఆ గొడ్డలిలాగే కనిపిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు కొడాలి నాని. అందులో తప్పేమీ లేదన్నారు . ఆ గొడ్డలి పరశురాముడి గొడ్డ‌లి అని ఆ మాత్రం తెలుసుకోక పోతే ఎలా అని ప్ర‌శ్నించారు. 2029లో ఈ రాష్ట్ర ప్రజలు జగన్ చేతికి ఆ పరశురాముడి గొడ్డలిని ఇవ్వబోతున్నారని చెప్పారు మాజీ మంత్రి. ఆ గొడ్డలితో ఆయన మీ పార్టీని, మీ అవినీతి సామ్రాజ్యాన్ని, మీ రాజకీయ జీవితాన్ని ముక్కలు ముక్కలుగా నరికి భూమిలో పాతిపెడతారని, ఆ విష‌యం తెలుస‌కుంటే మంచిద‌ని తీవ్రంగా హెచ్చ‌రించారు.

  • Related Posts

    వ్య‌వ‌సాయ రంగానికి బ‌డ్జెట్ లో ప్రాధాన్య‌త

    చెన్నై : త‌మిళ‌నాడు స‌ర్కార్ వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంది. ఇందులో భాగంగా సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ అధ్యక్ష‌త‌న కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వరి, చెరకు పంటలకు కనీస మద్దతు ధర పెంపుపై ప్రధానంగా చర్చించ‌నున్నారు. ఇవాళ జోసెఫ్…

    రైతుల‌కు రూ. 300 కోట్ల వార్షిక బ‌కాయిల చెల్లింపు

    అమ‌రావ‌తి : ఏపీ పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సీఎం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన సీఆర్డీఏ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలిపారు. పలు ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపార‌న్నారు. ఆలస్యం కారణంగా గృహ కొనుగోలుదారులు అదనపు ఆర్థిక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *