హైద‌రాబాద్ లో కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఆందోళ‌న

కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాలి

హైద‌రాబాద్ : అభిజిత్ దీప్కే సార‌థ్యంలోని కాక్రోచ్ జ‌న‌తా పార్టీ (సీజేపీ) ఆధ్వ‌ర్యంలో ఆదివారం హైద‌రాబాద్ లోని ఇందిరా పార్కు వ‌ద్ద భారీ ఆందోళ‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఈ నిరసనలో పాల్గొన్నారు ప్ర‌ముఖ ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌, ఉద్య‌మ‌కారుడు, పౌర స‌మాజం ప్ర‌తినిధి సోనమ్ వాంగ్‌చుక్. పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. కేంద్ర స‌ర్కార్ నిర్వాకం వ‌ల్ల‌నే కీల‌క‌మైన ప‌రీక్ష‌లు లీకుకు గురైన‌ట్లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వీటిని న‌మ్ముకున్న ల‌క్ష‌లాది మంది విద్యార్థులు రోడ్డున ప‌డ్డార‌ని, వారి భ‌విష్య‌త్తు అంధ‌కారంగా మారింద‌న్నారు వాంగ్ చుక్.

ఈ సంద‌ర్బంగా పరీక్షా పత్రాల లీకేజీ ఆరోపణలు , విద్యా వ్యవస్థలోని లోపాలపై ఆందోళన వ్యక్తం చేశారు .ఈ లోపాలకు బాధ్యత వహించాల్సింది కేంద్ర స‌ర్కార్ అని పేర్కొన్నారు. ముక్త కంఠంతో నిన‌దించారు. ఆందోళనకారులకు మద్దతు తెలపడంతో పాటు విద్యా రంగంలో సంస్కరణలు చేపట్టాలని పిలుపునిచ్చారు. వాంగ్ చుక్. పరీక్షలకు సంబంధించి తరచుగా తలెత్తుతున్న సమస్యలపై తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. అధికారులు మరింత పారదర్శకత. జవాబుదారీతనం పాటించాలని కోరుతూ పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత ఈ ఆందోళనలో పాల్గొన్నారు.

  • Related Posts

    వ్య‌వ‌సాయ రంగానికి బ‌డ్జెట్ లో ప్రాధాన్య‌త

    చెన్నై : త‌మిళ‌నాడు స‌ర్కార్ వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంది. ఇందులో భాగంగా సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ అధ్యక్ష‌త‌న కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వరి, చెరకు పంటలకు కనీస మద్దతు ధర పెంపుపై ప్రధానంగా చర్చించ‌నున్నారు. ఇవాళ జోసెఫ్…

    రైతుల‌కు రూ. 300 కోట్ల వార్షిక బ‌కాయిల చెల్లింపు

    అమ‌రావ‌తి : ఏపీ పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సీఎం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన సీఆర్డీఏ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలిపారు. పలు ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపార‌న్నారు. ఆలస్యం కారణంగా గృహ కొనుగోలుదారులు అదనపు ఆర్థిక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *