ఇరాన్ కు వార్నింగ్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్

ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు

అమెరికా : ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఇరాన్‌పై కొత్తగా సైనిక చర్యలు తప్పవని ట్రంప్ తీవ్ర స్థాయిలో హెచ్చ‌రించారు. ఇరాన్‌తో ఘర్షణకు ముగింపు పలికే ఉద్దేశంతో శాంతి ఒప్పందం కుదుర్చుకోనున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు కఠిన హెచ్చరిక జారీ చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. రెండు దేశాల మధ్య శత్రుత్వాన్ని అంతం చేసేందుకు రాబోయే ఒప్పందం ప్రకారం తమ బాధ్యతలను పాటించడంలో టెహ్రాన్ విఫలమైతే, తిరిగి సైనిక దాడులు ప్రారంభించాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరించారు.

ఈ శత్రు దేశాల మధ్య యుద్ధాన్ని ముగించే ఒప్పందంపై సంతకాలు జరగడానికి రెండు రోజుల ముందు, బుధవారం నాడు ట్రంప్ ఈ హెచ్చరిక చేశారు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్-సిసితో కలిసి G7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ట్రంప్ మాట్లాడారు. వారు (ఇరాన్ పక్షం) సరిగ్గా ప్రవర్తించక పోతే తాము నేరుగా వారి తలల మీదే బాంబులు వేయడం ప్రారంభిస్తాం అని వ్యాఖ్యానించారు. తాజాగా ట్రంప్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతోంది ప్ర‌పంచ వ్యాప్తంగా.

  • Related Posts

    వ్య‌వ‌సాయ రంగానికి బ‌డ్జెట్ లో ప్రాధాన్య‌త

    చెన్నై : త‌మిళ‌నాడు స‌ర్కార్ వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంది. ఇందులో భాగంగా సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ అధ్యక్ష‌త‌న కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వరి, చెరకు పంటలకు కనీస మద్దతు ధర పెంపుపై ప్రధానంగా చర్చించ‌నున్నారు. ఇవాళ జోసెఫ్…

    రైతుల‌కు రూ. 300 కోట్ల వార్షిక బ‌కాయిల చెల్లింపు

    అమ‌రావ‌తి : ఏపీ పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సీఎం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన సీఆర్డీఏ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలిపారు. పలు ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపార‌న్నారు. ఆలస్యం కారణంగా గృహ కొనుగోలుదారులు అదనపు ఆర్థిక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *