వార్షిక రుణ ప్రణాళికపై బ్యాంకర్లతో చర్చ

సీఎం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న మీటింగ్

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అధ్య‌క్ష‌త‌న రాష్ట్ర సచివాలయంలోని 5వ బ్లాక్‌లో 235వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం శుక్ర‌వారం నిర్వ‌హించారు. ఎస్ఎల్బీసీ సమావేశంలో 2026-27 వార్షిక రుణ ప్రణాళికపై బ్యాంకర్లతో చ‌ర్చించారు. వ్యవసాయ రంగం, ఎంఎస్ఎంఈ, స్వయం సహాయ సంఘాలు, కౌలు రైతులకు ఇచ్చిన రుణాలపై సమీక్ష జ‌రిపారు. 2025-26లో వ్యవసాయ రంగానికి రూ.3,86,249 కోట్ల రుణం ఇచ్చినట్టు వెల్లడించాయి బ్యాంకులు . ఎంఎస్ఎంఈ రంగానికి రూ.1,17,357 కోట్ల రుణాలు, ప్రాధాన్యతా రంగానికి రూ.5,19,693 కోట్ల రుణాలు ఇచ్చినట్టు వెల్లడించారు.

దక్షిణ భారతదేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో రుణ వితరణ 137 శాతం మేర ఉన్నట్టు తెలిపిన బ్యాంకర్లు . రాష్ట్రంలో ఆర్ధిక కార్యకలాపాలు జరిగేందుకు వీలుగా బ్యాంకర్లు సహకారం అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఎస్ఎల్ బీసీ సమావేశానికి హాజరైన సీఎస్ సాయి ప్రసాద్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ సీఈఓ ఆశీష్ పాండే, కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ డైరెక్టర్ నీలమ్ అగ్రవాల్, ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ ఏఓ బషీర్ నాబార్డ్ జీఎం కేవీఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ కీల‌క స‌మావేశంలో.

  • Related Posts

    వ్య‌వ‌సాయ రంగానికి బ‌డ్జెట్ లో ప్రాధాన్య‌త

    చెన్నై : త‌మిళ‌నాడు స‌ర్కార్ వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంది. ఇందులో భాగంగా సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ అధ్యక్ష‌త‌న కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వరి, చెరకు పంటలకు కనీస మద్దతు ధర పెంపుపై ప్రధానంగా చర్చించ‌నున్నారు. ఇవాళ జోసెఫ్…

    రైతుల‌కు రూ. 300 కోట్ల వార్షిక బ‌కాయిల చెల్లింపు

    అమ‌రావ‌తి : ఏపీ పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సీఎం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన సీఆర్డీఏ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలిపారు. పలు ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపార‌న్నారు. ఆలస్యం కారణంగా గృహ కొనుగోలుదారులు అదనపు ఆర్థిక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *