రేప‌టి నుంచి పులివెందుల‌లో జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న

మూడు రోజుల పాటు కీల‌క స‌మావేశాలు

వైఎస్ఆర్ క‌డ‌ప జిల్లా : వైసీపీ చీఫ్‌, మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి జూన్ 23 నుంచి మూడు రోజుల పాటు వైఎస్సార్ క‌డ‌ప జిల్లా లో ప‌ర్య‌టించ‌నున్నారు. టూర్ లో భాగంగా పులివెందుల‌కు చేరుకుంటారు. తన క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు .24వ తేదీ వేముల మండలం భూమయ్యగారిపల్లిలో లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాన్ని సందర్శించనున్నార‌ని వైసీపీ కేంద్ర పార్టీ వెల్ల‌డించింది. ఇదిలా ఉండ‌గా వైఎస్ జగన్ సీఎంగా ఉన్న స‌మ‌యంలో కోటిన్నరకు పైగా దేవాలయానికి మంజూరు చేశారు.

ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పాడా నిధులతో మరికొన్ని పనులు చేప‌ట్టారు. దాతల విరాళాలు కలుపుకుని రూ. 2.5 కోట్లతో దేవాలయ పునః ప్రతిష్ట కార్య‌క్ర‌మాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. దేవాలయంలో ప్రత్యేక పూజల అనంతరం క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డి. అనంత‌రం మధ్యాహ్నం నుంచి ప్రజాదర్బార్ నిర్వ‌హిస్తారు. 25వ తేదీ ఉదయం తిరిగి తాడేప‌ల్లిగూడెంకు చేరుకుంటారు.

  • Related Posts

    ‘జ్యోతిర్లింగాలు, మహాశక్తి పీఠాల’పై పుస్తకం ఆవిష్కరణ

    హైదరాబాద్ : భారతీయ ఆంగ్ల రచయిత్రి డాక్టర్ శిఖా భట్నాగర్ రచించిన ఆరవ పుస్తకం “జ్యోతిర్లింగాలు మరియు పద్దెనిమిది మహాశక్తి పీఠాల పౌరాణిక కథనాలు” ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగరేణి…

    కేసీఆర్ పై మ‌రీ ఇంత దిగ‌జారి రాస్తే ఎలా..?

    హైద‌రాబాద్ : బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు మాజీ సీఎం , త‌మ పార్టీ బాస్ కేసీఆర్ ప‌ట్ల మ‌రీ దిగ‌జారుడు రాత‌లు రాస్తున్న ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాధాకృష్ణ‌పై. ఈ సంద‌ర్బంగా తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. 72…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *