ఆధ్యాత్మిక వనాలను విరివిగా అభివృద్ధి చేయాలి

టీటీడీ అదనపు ఈవో వెంక‌య్య చౌద‌రి ఆదేశం

తిరుమల : తిరుమ‌ల పుణ్య‌క్షేత్రం భ‌క్త బాంధ‌వుల‌తో కిట కిట లాడుతోంది. భ‌క్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇదిలా ఉండ‌గా టీటీడీ పెద్ద ఎత్తున వ‌నాల‌ను అభివృద్ది చేస్తోంది. ఇదిలా ఉండ‌గా తిరుమలలో ఆధ్యాత్మిక వనాలను, ఔషధ వనాలను ఆక‌స్మికంగా ప‌రిశీలించారు టీటీడీ అద‌న‌పు ఈవో వెంక‌య్య చౌద‌రి. వ‌నాల‌ను విరివిగా అభివృద్ధి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

తిరుమలలో GNC, గీత పార్క్ , నామాల పార్క్ వంటి వివిధ ఉద్యానవనాలను పరిశీలించి టీటీడీ ఉద్యానవన, అటవీ శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన రానున్న బ్రహ్మోత్సవాలకు తిరుమలలోని ఉద్యానవనాలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్న మొక్కలను పెంచేలా చర్యలు చేపట్టాలని చెప్పారు . టీటీడీ ఫారెస్ట్ విభాగం డిప్యూటీ సీఎఫ్ ఫణి కుమార్ నాయుడు, ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    శ్రీ‌వారి ఉద్యోగులకు వెండి డాలర్‌, ప్రశంసా పత్రాలు

    తిరుపతి : తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్‌ మైదానంలో టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. భద్రతా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ…

    ఆగ‌స్టు 17 నుంచి ఆధ్యాత్మిక సేవ‌ల‌పై జాతీయ స‌ద‌స్సు

    తిరుపతి : తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. శ్రీ రామానుజులు, ఆచార్య పుండరీకాక్షులు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *