ప్ర‌ధాని మొహ‌ర్రం పండుగ శుభాకాంక్ష‌లు

VijayaBhaskar · June 26, 2026
Spread the love

ఇమామ్ హుస్సేన్ త్యాగం చిర‌స్మ‌ర‌ణీయం

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా శుక్ర‌వారం మొహ‌ర్రం పండుగ జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్బంగా జాతిని ఉద్దేశించి భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ముస్లిం సోద‌ర‌, సోద‌రీమ‌ణుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. మొహర్రం సందర్భంగా హజ్రత్ ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని స్మరించుకున్నారు. సత్యం ,న్యాయం కోసం సాగించే పోరాటంలో దృఢంగా నిలిచేలా హజ్రత్ ఇమామ్ హుస్సేన్ త్యాగం ఎంతోమందికి స్ఫూర్తినిస్తూనే ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

మొహర్రం సందర్భంగా ఆయన ఈ సందేశాన్ని అందించారు. హజ్రత్ ఇమామ్ హుస్సేన్ త్యాగం సత్యం , న్యాయం కోసం సాగించే పోరాటంలో దృఢంగా నిలిచేలా అనేకమందికి స్ఫూర్తినిస్తూనే ఉంది. ఇది ధైర్యం , దృఢ సంకల్పం యొక్క శాశ్వత శక్తికి కూడా ఒక నిదర్శనం అని ప్రధాని మోదీ సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా పంచుకున్నారు. కర్బలా యుద్ధంలో ప్రవక్త మహమ్మద్ మనవడైన హజ్రత్ ఇమామ్ హుస్సేన్ పొందిన అమరత్వాన్ని స్మరించుకుంటూ షియా ముస్లింలు మొహర్రంను ఆచరిస్తారు. ఇది కొన్ని త‌రాల నుంచి జ‌రుపు కోవ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.