అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు

వ‌ర్షాలు స‌మృద్దిగా పడాల‌ని కోరుకుంటున్నా

అమ‌రావ‌తి : భూమాతను, పశుసంపదను ఆరాధిస్తూ ప్రకృతితో మనిషికున్న అనుబంధాన్ని చాటి చెప్పే వ్యవసాయ పండుగ ఏరువాక పున్నమి. ఏటా జేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు రైతులంతా ఆనందోత్సాహాల మధ్య నేల తల్లికి ప్రణమిల్లి కొత్త సాగుకు శ్రీకారం చుట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా యావత్ రైతాంగానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతుల లోగిళ్లు పంటలు, సిరిసంపదలతో తులతూగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణ‌ఙ‌ద‌ల‌.

రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంద‌న్నారు. ఇప్పటికే తొలి విడత పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసి రైతాంగం పట్ల మా కూటమి ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను చాటుకున్నాం అని తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న విబి జీ- రాం జీ పనుల్లోనూ రైతుకి మేలు చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం అని ప్ర‌క‌టించారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని స్ప‌ష్టం చేశారు .

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *