చంద్రప్రభ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు
రాజ దర్బార్ కృష్ణుడు అలంకరణలో భక్తులకు దర్శనం
తిరుపతి : తిరుపతి పరిధిలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) ఆధ్వర్యంలో అంగరంగ వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి 07.00 గం.లకు లకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారు చంద్రప్రభ వాహనంపై రాజ దర్బార్ కృష్ణుడు అలంకారంలో భక్తులను అనుగ్రహించారు.
సా. 5.00 – 05.30 గం.ల మధ్య ఊంజల్ మండపంలోకి శ్రీవారు వేంచేపు చేశారు. సా. 5.30 – 6.30 గం.ల మధ్య ఊంజల్ సేవ నిర్వహించారు. ఇదిలా ఉండగా గురువారం ఉదయం 08.45 గం.లకు రథోత్సవం ఘనంగా నిర్వహించారు. వాహన సేవలో టిటిడి డిప్యూటీ ఈవో హరీంధ్రనాథ్, ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ వేణుగోపాల్, అర్చకులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని టీటీడీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఇతర ప్రాంతాల నుండి స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున తరలి వచ్చారు.