ముంబై : బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన చిత్రం పెద్ది. ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు రామ్ చరణ్ , జాహ్నవి కపూర్, జగపతి బాబు, శివ రాజ్ కుమార్. ఈ సినిమా విడుదలై మిశ్రమ స్పందన లభించింది. ఆశించిన దానికంటే ఎక్కువగా సక్సెస్ కాలేక పోయింది. ప్రత్యేకంగా దర్శకుడు జాహ్నవి కపూర్ ను కేవలం అందాల ఆరబోతకే ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియా వేదికగా తనను ఏకి పారేశారు. సంగీతం పరంగా ఏఆర్ రెహమాన్ క్యాచీ ట్యూన్స్ ఇచ్చినా వర్కవుట్ కాలేక పోయింది. ఈ సమయంలో కీలక ప్రకటన చేసింది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సంస్థ నెట్ ఫ్లిక్స్.
శనివారం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీని జూలై 9వ తేదీన స్ట్రీమింగ్ కానుందని వెల్లడించింది. చెర్రీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. ఇది త్వరలోనే డిజిటల్ వేదికపైకి రానుంది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ సోషల్ మీడియాలో పంచుకుంటూ ఆట మారొచ్చు కానీ, మొనగాడు మాత్రం మారడు. ‘పెద్ది’ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ , మలయాళ భాషల్లో నెట్ఫ్లిక్స్లో చూడండి (హిందీలో త్వరలో రానుంది)” అని ఇన్స్టాగ్రామ్లో పేర్కొంది. ‘దేవర’ తర్వాత జాహ్నవి కపూర్ కు ఇది రెండవ తెలుగు చిత్రం. ‘పెద్ది’ ఒక స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా, ఇది థియేటర్లలో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. క్రీడా ప్రపంచం నేపథ్యంలో సాగే ఈ కథ, క్రీడాకారుల తీవ్రమైన ఆశయాలను, బలమైన భావోద్వేగాలను మిళితం చేస్తుంది.















