గుడివాడ అమ‌ర్నాథ్ మ‌హిళ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాల్సిందే

అమ‌రావ‌తి : రాష్ట్రంలో మ‌హిళ‌లు త‌ల దించుకునేలా వైసీపీ నేత‌లు వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు మంత్రి గుమ్మ‌డి సంధ్యారాణి. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హోం మంత్రి అనిత పై , ఒక దళిత మహిళపై చేసిన మేకప్ వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? వాళ్ళు మేకప్ వేసుకోరా? ఆంధ్రప్రదేశ్‌లో బొట్టు, కాటిక, పౌడర్ పెట్టుకోకుండా బయటకొచ్చే మహిళలు ఉన్నారా? మహిళల చీరకట్టు,…

newsseals-GudivadaAmarnath

అమ‌రావ‌తి : రాష్ట్రంలో మ‌హిళ‌లు త‌ల దించుకునేలా వైసీపీ నేత‌లు వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు మంత్రి గుమ్మ‌డి సంధ్యారాణి. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హోం మంత్రి అనిత పై , ఒక దళిత మహిళపై చేసిన మేకప్ వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? వాళ్ళు మేకప్ వేసుకోరా? ఆంధ్రప్రదేశ్‌లో బొట్టు, కాటిక, పౌడర్ పెట్టుకోకుండా బయటకొచ్చే మహిళలు ఉన్నారా? మహిళల చీరకట్టు, రంగు, బాడీ షేమింగ్‌లపై కామెంట్లు చేయడానికి మీకు సభ్యత, సంస్కారం ఉన్నాయా? అని మంత్రి నిలదీశారు. మహిళా కమిషన్ పిలిచి విచారిస్తే, చేసిన తప్పును సమర్థించుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టడం సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఒక మహిళ కడుపులోనే పుడతారనే విషయాన్ని గుర్తుంచు కోవాలని, మహిళలను గౌరవించని మీ బాస్ (జగన్ రెడ్డి) అండలోనే ఇలాంటి సంస్కారహీన రాజకీయం నేర్చుకున్నారని విమర్శించారు.

సొంత తల్లిని, చెల్లిని గౌరవించని వాళ్ళు సమాజంలోని మహిళలను గౌరవిస్తారని ఆశించలేమన్నారు. గతంలో మంత్రులుగా చేసిన వారు మహిళల మేకప్, పౌడర్లు, బొట్ల గురించి మాట్లాడటం వారి సంస్కార హీనతకు నిదర్శనం. మీ ఇళ్లల్లో ఆడవాళ్ళు లేరా? వారు ఇవి వాడటం లేదా? చదువుకుని, నగరాల్లో పెరిగిన మీకే కనీస సభ్యత లేకపోతే ఎలా? మహిళా కమిషన్ ముందుకు వెళ్లి వచ్చిన తర్వాత కూడా బాధ్యతా రాహిత్యంగా మాట్లాడిన అమర్నాథ్ తక్షణమే రాష్ట్ర మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని అన్నారు సంధ్యారాణి. మీ వ్యాఖ్యలకు నిరసనగా మహిళలు మీ ఫోటోలను నడిరోడ్డుపై పెట్టి కోడిగుడ్లతో కొట్టిన విషయాన్ని మర్చిపోవద్దు. మీ బాస్ జగన్మోహన్ రెడ్డిని చూసే మీరు ఇలాంటి బూతులు నేర్చుకున్నట్టున్నారు. సొంత చెల్లి షర్మిల గారి చీర గురించి, ఆమె క్యారెక్టర్ గురించి తన సొంత పత్రికల్లో రాయించిన దౌర్భాగ్యుడు మీ అధినేత. చివరకు ఆమె వైఎస్సార్‌కే పుట్టలేదనే స్థాయికి దిగజారి పత్రికల్లో రాయించి, కన్నతల్లి విజయమ్మని ఎంతగా అవమానించారో అందరూ చూశారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports