సమతామూర్తిని దర్శించుకున్న కేంద్ర జాయింట్ సెక్రటరీ

శంషాబాద్ (ముచ్చింతల్): కేంద్ర సమాచార, ప్రసార శాఖ జాయింట్ సెక్రటరీ పృథుల్ కుమార్ తన కుటుంబ సమేతంగా ముచ్చింతల్ లోని సమతామూర్తి (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ)ని సందర్శించారు. 216 అడుగుల ఎత్తున్న భగవద్ రామానుజాచార్యుల విగ్రహాన్ని దర్శనం చేసుకున్నారు. సువర్ణ విగ్రహాన్ని వారు దర్శించుకుని, ప్రత్యేక పూజలో వారు పాల్కొన్నారు. అనంతరం ఆవరణలోని 108 దివ్య దేశాల నమూనా ఆలయాలను, భద్రవేదిలోని డిజిటల్ లైబ్రరీ, సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించారు.

ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు వారికి ఘన స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సమతామూర్తి కేంద్ర విశిష్టత, రామానుజాచార్యుల సమానత్వ సందేశం అద్భుతంగా ఉన్నాయని ఈ సందర్భంగా కొనియాడారు. ఇదే స‌మ‌యంలో ఎన్నో కోట్లు ఖ‌ర్చు చేసి శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన‌జీయ‌ర్ స్వామీజీ శ్రీ రామానుజుల వారి విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయ‌డం అభినంద‌నీయ‌మ‌ని పేర్కొన్నారు కేంద్ర స‌మాచార‌, ప్ర‌సార శాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి. ఇదిలా ఉండ‌గా తిరుమ‌ల‌లో శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామికి పూర్వ వైభ‌వాన్ని తీసుకు రావ‌డంలో కీల‌క పాత్ర పోషించారు.

  • Related Posts

    వృద్దురాలికి ఆస‌రా పోలీసుల భ‌రోసా

    తిరుప‌తి : తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణతో పాటు ఆపదలో ఉన్న వారికి తక్షణ సహాయం అందించే దిశగా తిరుపతి జిల్లా పోలీసులు నిరంతరం సేవలందిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీనివాసం పరిసర…

    శ్రీ‌వారి భ‌క్తుల‌ను వేధిస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వు

    తిరుపతి : శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులతో అసభ్యంగా ప్రవర్తించడం, అదనపు డబ్బులు డిమాండ్ చేయడం, బెదిరింపులకు పాల్పడడం లేదా మానసిక వేధింపులకు గురిచేయడం వంటి చర్యలను ఏమాత్రం సహించబోమని తిరుపతి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎల్. సుబ్బరాయుడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *