ద‌ర్శ‌కుడు గుడ్లూరి అశోక్ బాబుపై కేసు న‌మోదు

హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గుడ్లూరి అశోక్ బాబుకు షాక్ త‌గిలింది. సైబరాబాద్ ఈఓడబ్ల్యూ లో దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబు పై కేసు నమోదు చేశారు. . యువకుడిని హీరోగా పరిచయం చేస్తానంటూ మోసం చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. యువకుడి తల్లిదండ్రుల దగ్గర్నుంచి మూడున్నర కోట్ల రూపాయలు తీసుకున్నట్లు వాపోయారు బాధితులు. ఈ మేర‌కు వారు సైబ‌రాబాద్ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. దీంతో దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబును విచార‌ణ‌కు పిలిపించిన‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉండ‌గా స‌ద‌రు యువకుడిని హీరోగా చేయకుండా డబ్బులు ఇవ్వక పోవడంతో విసిగి పోయిన బాధితులు చివ‌ర‌కు ఖాకీల వ‌ద్ద‌కు వెళ్లారు.

బాధితుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు విచార‌ణ ప్రారంభించిన‌ట్లు టాక్. యువకుడి తండ్రి హనుమంతరావు ఇచ్చిన ఫిర్యాదు తో అశోక్ బాబుపై కేసు నమోదు.. నిర్మాత విజయలక్ష్మి, దర్శకుడు గుడ్లూరు అశోక్ బాబులను పిలిచి విచారిస్తున్నారు పోలీసులు. తమ కొడుకును హీరోగా చేస్తానని చెప్పి దర్శకుడు పలు దఫాలుగా డబ్బులు తీసుకున్నాడని ఆరోపించారు. హీరోను చేయకపోగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వలేదంటూ వాపోయారు. ఇదిలా ఉండ‌గా గుడ్లూరి అశోక్ బాబు తెలుగులో భాగమతి, పిల్ల జమిందార్, ఆకాశరామన్న లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.

  • Related Posts

    టాక్సిక్ మూవీలో కియారా అద్వానీ అందాల ఆరబోత

    బెంగ‌ళూరు : గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం టాక్సిక్. హాలీవుడ్ ను త‌ల‌పించేలా మూవీని తెర‌కెక్కించింది ద‌ర్శ‌కురాలు. రొమాన్స్, క్రైమ్, థ్రిల్ల‌ర్ ను మేళ‌విస్తూ స‌స్పెన్స్ కొన‌సాగిస్తూ ఆద్యంతం ఆక‌ట్టుకునేలా తీర్చిదిద్ద‌డంతో ఈ మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.…

    విద్య పట్ల ఆసక్తే జ్ఞానానికి నాంది : ఘంటా చ‌క్ర‌పాణి

    హైద‌రాబాద్ : అంబేద్క‌ర్ యూనివ‌ర్శిటీ వైస్ ఛాన్స‌ల‌ర్ డాక్ట‌ర్ ఘంటా చ‌క్ర‌పాణి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న సామాజిక వేదిక ఎక్స్ ద్వారా త‌న ఆనందాన్ని పంచుకున్నారు .ఈ రోజు, నాకు అత్యంత ఇష్టమైన నటులలో ఒకరైన, అపార ప్రతిభావంతుడైన రాహుల్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *