తెలంగాణ జెన్కోలో ఇంఛార్జ్ ప్ర‌మోష‌న్లు

హైదరాబాద్ : తెలంగాణ జెన్‌కో అకౌంట్స్ వింగ్‌లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇన్‌చార్జ్ ప్రమోషన్లకు ఇటీవల ఆమోదం లభించింది. ఈ మేర‌కు సర్కార్ ఉత్తర్వులు జారీ చేయ‌డంతో అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పి. అంజయ్య నేతృత్వంలోని ప్రతినిధి బృందం తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఎనర్జీ) నవీన్ మిట్ట‌ల్ ను మర్యాద పూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. అకౌంట్స్ వింగ్‌లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇన్‌చార్జ్ ప్రమోషన్ల సమస్య పరిష్కారానికి చొరవ తీసుకొని ఉత్తర్వులు జారీ అయ్యేలా సహకరించినందుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియ జేశారు.

అనంతరం ప్రతినిధి బృందం తెలంగాణ జెన్‌కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) డాక్టర్ ఎస్. హరీష్ ని కూడా మర్యాద పూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించి, అకౌంట్స్ వింగ్‌లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇన్‌చార్జ్ ప్రమోషన్లు మంజూరు కావడానికి అందించిన సహకారం, చొరవకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నిర్ణయం అకౌంట్స్ విభాగ అధికారుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని, భవిష్యత్తులో కూడా ఉద్యోగుల సంక్షేమం, కెరీర్ అభివృద్ధి , పెండింగ్‌లో ఉన్న ఇతర సమస్యల పరిష్కారానికి ఇదే విధమైన సహకారం అందించాలని అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.

  • Related Posts

    ధ‌ర్మ‌పురం అర‌వింద్ ఆరోప‌ణ‌లు అబ‌ద్దం : డీజీపీ

    హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. సోష‌ల్ మీడియా ఎక్స్ (ట్విట్ట‌ర్ ) వేదిక‌గా నిజామాబాద్ కు చెందిన భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ ధ‌ర్మ‌పురం అర‌వింద పోలీసుల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ…

    స‌ర్ ప్ర‌క్రియపై క‌మిష‌న‌ర్ క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న

    హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ (జీహెచ్ఎంసీ) కమిషనర్ ఆర్.వి. కర్ణ‌న్ నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని AC గార్డ్స్, CIB క్వార్టర్స్ (పోలింగ్ స్టేషన్ నం. 1) వద్ద జరుగుతున్న ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) నోటీసుల పంపిణీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *