బాధిత కుటుంబాల‌కు సీఎం విజ‌య్ భ‌రోసా

చెన్నై : క‌రూర్ ఘ‌ట‌న త‌న‌ను తీవ్ర ఆవేద‌న‌కు గురి చేసింద‌న్నారు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. కరూర్ తొక్కిసలాట బాధితుల కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఇదిలా ఉండ‌గా సెప్టెంబర్ 27, 2025న విజయ్ ప్రసంగించిన టీవీకే (TVK) ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరణించిన ఈరోడ్‌కు చెందిన కందసామి కుమారుడి తల్లి కె. శాంతికి రూ. 10 లక్షల పరిహారాన్ని కూడా ఆయన అందించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కరూర్‌కు తన తొలి అధికారిక పర్యటనలో భాగంగా తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ కరూర్ కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కరూర్‌లో జరిగిన ఆ తొక్కిసలాటలో ప్రభావితమైన 31 కుటుంబాల సభ్యులకు ఆయన కారుణ్య నియామక పత్రాలను అందజేశారు.

పాఠశాల విద్యాశాఖ, రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, పోలీస్, రిజిస్ట్రేషన్, పట్టణ పంచాయతీల శాఖలు, కరూర్ కలెక్టరేట్‌లో జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్, నైట్ వాచ్‌మన్ వంటి ఉద్యోగాలు లబ్ధిదారులకు కల్పించారు. అంతకు ముందు మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్, 41 మంది బాధితుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతినిస్తూనే, ఆ నియామకాలు తాత్కాలిక ప్రాతిపదికన ఉండాలని తీర్పునిచ్చింది. ఈ కార్యక్రమంలో ప్రజా పనులు ,క్రీడా అభివృద్ధి శాఖ మంత్రి ఆధవ్ అర్జున, రెవెన్యూ , విపత్తు నిర్వహణ శాఖ మంత్రి కె.ఎ. సెంగోట్టయన్, పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి సి. విజయలక్ష్మి, కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి, ప్రధాన కార్యదర్శి ఎం. సాయికుమార్, కరూర్ జిల్లా కలెక్టర్ సి. ముత్తుకుమారన్ , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

  • Related Posts

    మూసీ ప్రాజెక్ట్ కోసం భూ సేకరణ ను వేగవంతం చేయాలి

    హైద‌రాబాద్ : తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి మూసీ ప్రాజెక్టుపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ లోని ఎంసీఆర్ హెచ్ ఆర్ డి బోధి పెవిలియన్ లో మూసీ పైన సీఎం స‌మీక్ష చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా కీల‌క…

    సీఎం జోసెఫ్ విజ‌య్ నిర్ణ‌యం రైతులు సంతోషం

    చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్ర ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. గ‌తంలో ప్ర‌క‌టించిన ప‌రంధూర్ ఎయిర్ పోర్టు ప్రాజెక్టును ర‌ద్దు చేస్తున్న‌ట్లు శాస‌న స‌భ సాక్షిగా వెల్ల‌డించారు. ఈ ప్రాజెక్టు చేప‌ట్ట‌డం వ‌ల్ల త‌మ విలువైన భూములు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *