అద్దంకి ద‌యాక‌ర్, బ‌ల్మూర్ వెంక‌ట్ కు కేబినెట్ హోదా

హైద‌రాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌భుత్వం, పార్టీ త‌ర‌పున గ‌ట్టిగా వాయిస్ వినిపిస్తున్న ప్ర‌స్తుతం శాస‌న మండ‌లిలో విప్ లుగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న ఎమ్మెల్సీలు అద్దంకి ద‌యాక‌ర్, బ‌ల్మూర్ వెంక‌ట్ ల‌కు తీపి క‌బురు చెప్పింది. వీరికి కేబినెట్ ర్యాంక్ హోదా క‌ల్పిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ ఇద్ద‌రు నేత‌లు పొద్ద‌స్త‌మానం బీఆర్ఎస్ నేత‌ల‌ను టార్గెట్ చేస్తూ వ‌స్తున్నారు. దీంతో ప‌దోన్న‌తి క‌ల్పించారంటూ విప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. ఇది ప‌క్క‌న పెడితే రాష్ట్ర అభివృద్ది పై ఏనాడూ ఫోక‌స్ పెట్ట‌లేద‌న్న విమర్శ‌లు ఎదుర్కొంటున్నారు.

ఇక తాజాగా అద్దంకి దయాకర్ , డాక్టర్ వెంకట్ నర్సింగ్ రావు బల్మూర్‌లకు ‘మంత్రి స్థాయి’ హోదా కల్పించడం ప‌ట్ల సీఎంకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, తెలంగాణ శాసనమండలిలో ప్రభుత్వ విప్‌లుగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్ మరియు డాక్టర్ వెంకట్ నర్సింగ్ రావు బల్మూర్‌లకు ‘మంత్రి స్థాయి’ హోదాను కల్పించారు. వారి పదవీకాలం పూర్తయ్యే వరకు ఈ హోదా అమలులో ఉంటుంద‌ని పేర్కొన్నారు. త‌మ‌పై న‌మ్మ‌కం ఉంచి కేబినెట్ హోదా క‌ల్పించినందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

  • Related Posts

    నియోజ‌క‌వ‌ర్గాల వారీగా కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక : సీఎం

    అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న 20 గంట‌లకు పైగా రాష్ట్రం అభివృద్ది, సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్ర‌తిరోజూ ప‌ర్య‌వేక్షిస్తూ, స‌మీక్షిస్తూ పాల‌నా ప‌రంగా త‌న‌దైన ముద్ర క‌న‌బ‌రుస్తున్నారు.…

    న్యూయార్క్ లో త‌ళుక్కుమ‌న్న మోహ‌న్ భ‌గ‌వ‌త్

    అమెరికా : అమెరికా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ న్యూయార్క్ కు చేరుకున్నారు. ఆయ‌న సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారారు. భారతదేశపు అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్‌కు అధిపతిగా, క్షేత్రస్థాయిలో భారతదేశపు నాడిని ఆయనకు తెలిసినంతగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *