సాగు నీటి రంగానికి ఏపీ స‌ర్కార్ ప్రాధాన్య‌త

అమ‌రావ‌తి : వంశధార నుంచి పెన్నా వరకూ రాష్ట్రంలో నదులు అనుసంధానం జరగాలన్నదే నా ఆకాంక్ష అని ప్ర‌క‌టించారు సీఎం చంద్ర‌బాబు నాయుడు. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ తరహాలో నదులు అనుసంధానమైతే భారత్ దేశానికి తిరుగు ఉండదు అన్నారు. సముద్రంలోకి వెళ్లే నీటిని సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తే పెద్ద ఎత్తున సంపద సృష్టి జరుగుతుంది. ప్రాధాన్యతా క్రమంలో 36 ప్రాజెక్టులను వచ్చే మూడేళ్లలో రూ.35 వేల కోట్లతో పూర్తి చేస్తాం.ఈ ఏడాది జూన్ లో తుంగభద్ర ప్రాజెక్టు కు కొత్త గేట్లు ఏర్పాటు చేసి ప్రారంభించాం. కాటన్ బ్యారేజికి కూడా కొత్త గేట్ల పనులు ప్రారంభించాం. వచ్చే ఏడాదికి ఈ పనులు పూర్తి అవుతాయి. గుంటూరు ఛానల్ ఆధునీకరణ పనులకు కూడా ఈ నెలలోనే శంకుస్థాపన చేసి రెండేళ్లలో పూర్తి చేస్తాం. పోలవరం ఎడమ కాలువ పూర్తి అయ్యిందన్నారు సీఎం.

ఆగస్టు 14 తేదీన గోదావరి జలాలకు అనకాపల్లి వద్ద స్వాగతం పలుకుతాం. వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ ను 2026 సెప్టెంబరు 1 తేదీన జాతికి అంకితం చేస్తాం. ఈ ప్రాజెక్టులో రూ.4 వేల కోట్ల పనులు పెండింగ్ లో ఉన్నా గత పాలకులు ప్రాజెక్టు ప్రారంభించామని నాటకాలు ఆడారు. సొరంగంలో టన్నెల్ బోరింగ్ యంత్రం ఇరుక్కు పోయి ఉన్నా జాతికి అంకితం చేశార‌ని అన్నారు. గత పాలకులు చేసిన మోసాన్ని కూడా ప్రజలకు చెబుతాం. రాష్ట్రంలో కురిసే ప్రతీ వర్షపు చుక్కనూ భూగర్భ జలంగా మార్చుకోవాల్సి ఉంది. జలధార కింద ఈ పనులు పెద్ద ఎత్తున చేపట్టాం. రాష్ట్ర భవిష్యత్తుకు విరోధంగా పనిచేసే వారి పట్ల మనం అంతా అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చ‌రించారు సీఎం.

  • Related Posts

    నిజామాబాద్ అభివృద్దికి క‌ట్టుబ‌డి ఉన్నా

    హైద‌రాబాద్ : టీపీసీసీ చీఫ్ , ఎమ్మెల్సీ మ‌హేష్ కుమార్ గౌడ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఉమ్మడి నిజామాబాద్ అభివృద్ధికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ మరో కీలక ముందడుగు వేశారు. జిల్లా…

    ఢిల్లీ ప‌ర్య‌ట‌నలో మంత్రి ఎస్. స‌విత బిజీ

    అమరావతి : రాష్ట్రానికి చెందిన టెక్స్ టైల్స్ ఉత్పత్తులు అమ్మకాలే లక్ష్యంగా రెండ్రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి గురువారం రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ ప్రగతి మైదానంలోని భారత్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *