ఆగ‌స్టు 8న ‘టాక్సిక్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్

బెంగ‌ళూరు : గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన టాక్సిక్ ఇప్ప‌టికే అంచ‌నాలు పెంచుతోంది. క‌న్న‌డ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో టాప్ హీరో గా పేరు పొందిన యష్ , కియారా అద్వానీలపై చిత్రీకరించిన ‘తబాహి’ అనే పాట ఇటీవల విడుదలైంది. యష్ తన అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘టాక్సిక్’ విడుదల కోసం సిద్ధమవుతోంది. ఈ మూవీ 2026 ఆగస్టు 26న భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. విశ్వ‌స‌నీయ సమాచారం ప్రకారం ‘టాక్సిక్’ ట్రైలర్ 2026 ఆగస్టు 8న విడుదలయ్యే అవకాశం ఉంది. అదే రోజున బెంగళూరులో భారీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా జరగనుంది. చిత్ర బృందం ఇప్పటికే రెండు టీజర్‌లను విడుదల చేసింది.

ఈ ట్రైలర్ సినిమా ప్రచారంలో అత్యంత కీలకమైన అంశంగా నిలవనుంది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ (Toxic: A Fairytale for Grown-Ups) చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ , హుమా ఖురేషి వంటి ప్రముఖ తారాగణం ఉంది. ఈ చిత్రాన్ని కన్నడ, ఆంగ్ల భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించారు, అలాగే ఇది ఇతర భాషల్లో కూడా విడుదల కానుంది. KVN ప్రొడక్షన్స్ , మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 26న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల, యష్ ,కియారా అద్వానీలపై చిత్రీకరించిన ‘తబాహి’ అనే పాట విడుదలైంది.

  • Related Posts

    కేసీఆర్ వ‌ల్ల‌నే తెలంగాణ రాష్ట్రం సాధ్య‌మైంది

    హైద‌రాబాద్ : ప్ర‌ముఖ కార్టూనిస్ట్ శంక‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇప్పుడున్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌లో త‌న‌కు అత్యంత ఇష్ట‌మైన నాయ‌కుల‌లో కేటీఆర్ ఒక‌రు అని పేర్కొన్నారు. అదే స‌మ‌యంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు…

    భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఆభరణం

    అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు భోగాపురం ఎయిర్ పోర్టు గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌మ ప్ర‌భుత్వం మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌పై ఎక్కువ‌గా దృష్టి సారించింద‌న్నారు. ఈ సంద‌ర్బంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక ఆభరణంలా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *