భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఆభరణం

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు భోగాపురం ఎయిర్ పోర్టు గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌మ ప్ర‌భుత్వం మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌పై ఎక్కువ‌గా దృష్టి సారించింద‌న్నారు. ఈ సంద‌ర్బంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక ఆభరణంలా (హారంగా) నిలుస్తుందని నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ కొత్త విమానాశ్రయం ఆ ప్రాంత పరిస్థితులను సమూలంగా మారుస్తుందని, ఆగస్టు 1న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దీనిని ప్రారంభిస్తారని ముఖ్యమంత్రి తెలిపారు.

విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాద‌వ్ , అచ్చెన్నాయుడు, వంగ‌ల‌పూడి అనిత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, విమానయాన శాఖ అధికారులు, విమానాశ్రయాన్ని నిర్మించిన జీఎంఆర్ (GMR) సంస్థ ప్రతినిధులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా సీఎం చంద్ర‌బాబు నాయుడు ప‌లు కీల‌క సూచ‌న‌లు చేశారు. ప్రారంభోత్స‌వ కార్య‌క్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు.

  • Related Posts

    కేసీఆర్ వ‌ల్ల‌నే తెలంగాణ రాష్ట్రం సాధ్య‌మైంది

    హైద‌రాబాద్ : ప్ర‌ముఖ కార్టూనిస్ట్ శంక‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇప్పుడున్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌లో త‌న‌కు అత్యంత ఇష్ట‌మైన నాయ‌కుల‌లో కేటీఆర్ ఒక‌రు అని పేర్కొన్నారు. అదే స‌మ‌యంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు…

    26 వరకు హైదరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు

    హైద‌రాబాద్ : గోల్కొండ కోటలో జరిగే శ్రీ జగదాంబ మహంకాళి బోనాల ఉత్సవాల సందర్భంగా, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులను ప్రకటించారు. భారీ సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారని అంచనా వేస్తున్నందున జూలై 23, 26…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *