సీఎంను క‌లిసిన యూఏఈ మంత్రి అబ్దుల్ బిన్ తౌక్

అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మ‌ర్యాద పూర్వ‌కంగా మంగ‌ళ‌వారం క‌లిశారు యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ కు చెందిన ఆర్థిక‌, ప‌ర్యాట‌క శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రి . ఈ ఏడాదిలో ముఖ్యమంత్రి దావోస్ లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఆంధ్రప్రదేశ్‌లో ‘ఫుడ్ క్లస్టర్’ను ఏర్పాటు చేయడానికి UAE తన సంసిద్ధతను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. UAE ప్రతినిధి బృందంతో జరిపిన సమగ్ర చర్చల అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం , UAE మధ్య భాగస్వామ్య ఒప్పందం కుదిరింది.

మామిడి, అరటి , కోకో వంటి వివిధ ఉద్యానవన పంటలను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసేందుకు వీలుగా ఒక ‘వాల్యూ చైన్’ (విలువ గొలుసు వ్యవస్థ)ను ఏర్పాటు చేయాలని వారు నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ టి.జి. భరత్ తో పాటు వివిధ శాఖ‌ల‌కు చెందిన ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. ఈ చ‌ర్చ‌ల‌లో ఆంధ్రప్రదేశ్‌లో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో యుఏఈ ప్రతినిధుల బృందం చర్చలు జ‌రిపింది. ఆహార శుద్ధి రంగంలో ఏపీలో వ్యాల్యూచైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది యూఏఈ. ఈమేరకు ఏపీ ప్రభుత్వం- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య భాగస్వామ్యం ఏర్పాటు కుదిరింది.

  • Related Posts

    సోష‌ల్ మీడియాలో అసత్య ప్ర‌చారంపై ఫోక‌స్ పెట్టాలి

    విజ‌య‌వాడ : సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం పెరుగుతోందని, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రచారాన్ని వాస్తవాలు, ఆధారాలతో తిప్పికొట్టే బాధ్యత పోలీసులదేనని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగ‌ల‌పూడి. ప్రతి ఘటనపై ప్రజలకు పారదర్శకంగా సమాచారం…

    ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి

    అమ‌రావ‌తి : కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి జోడెడ్ల బండిలా సాగుతున్నాయని అన్నారు మంత్రి నారా లోకేష్. మంగళగిరిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, 24 గంటలు తాగునీరు, పార్కులు, శ్మశానాల అభివృద్ధి వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. రాష్ట్రస్థాయిలో 4వేల పెన్షన్,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *