newsseals.com
DEVOTIONAL

24 నుంచి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం

VijayaBhaskar July 22, 2026
newsseals-Jyestabhishekaam

తిరుపతి : తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారి ఉత్సవ మూర్తులకు జూలై 24 నుంచి 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జ్యేష్ఠాభిషేకం (అభిధేయక అభిషేకం) నిర్వహించనున్నారు. ఈ విష‌యాన్ని టీటీడీ అధికారికంగా వెల్ల‌డించింది. ఈ వార్షిక ఉత్సవంలో స్వామివారి స్వర్ణక వచాలను శాస్త్రోక్తంగా తొలగించి, పవిత్రంగా శుద్ధి చేసి తిరిగి అలంకరిస్తారు.

మ‌హోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని జూలై 24న కవచాధివాసం, 25న కవచ ప్రతిష్ఠ, 26న కవచ సమర్పణ
ఉంటుంద‌ని టీటీడీ పేర్కొంది. ప్రతిరోజూ ఉదయం మహాశాంతి హోమం, పుణ్యాహవచనం, ఉదయం 10 గంటలకు స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం శతకలశ స్నపనం, సాయంత్రం వీధి ఉత్సవం భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించనున్న‌ట్లు టీటీడీ తెలిపింది. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో జ్యేష్ఠా నక్షత్రం సందర్భంగా నిర్వహించే ఈ జ్యేష్ఠాభిషేకం ద్వారా శ్రీ గోవింద రాజ స్వామి వారు భక్తులకు దివ్య మంగళ దర్శనమిచ్చి అనుగ్రహిస్తారని ఆలయ ఆగమ పండితులు పేర్కొంటున్నారు.