newsseals.com

పీఎండీఎస్ ద్వారా రైతులకు విస్తృత సూచనలు

July 26, 2026 · VijayaBhaskar

అమ‌రావ‌తి : రైతు సాధికార సంస్థ–పీఎండీఎస్ కింద 23 లక్షల మంది రైతులు, 25 లక్షల ఎకరాల లక్ష్యానికి గాను, ఇప్పటివరకు 14.82 లక్షల మంది రైతులు అంటే 67 శాతం, 16.67 లక్షల ఎకరాలు అంటే 64 శాతం లక్ష్యాన్ని సాధించామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పెల్లెటైజ్డ్ పీఎండీఎస్ కింద 4.19 లక్షల మంది రైతులు అంటే 28 శాతం, 4.20 లక్షల ఎకరాలు అంటే 25 శాతం పురోగతి నమోదైందన్నారు. అంతరకృషి, ఆకులపై ఎరువుల పిచికారీ, నేలలో తేమ సంరక్షణ, పంట పొలాల సరిహద్దుల్లో పంటల సాగుకు సంబంధించి రైతులకు 1.68 కోట్ల సూచనలు జారీ చేశామని మంత్రి తెలిపారు.

కందులు, పెసలు, కొర్రలు, మినుములు, నువ్వులకు సంబంధించిన 14,078 క్వింటాళ్ల అత్యవసర ప్రత్యామ్నాయ విత్తనాలను ఏపీ స్టేట్ సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా సిద్ధం చేశామని చెప్పారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాల్లో కూడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు అచ్చెన్నాయుడు. వరి పంట నుంచి ఇతర పంటలకు మార్పిడి చేయడానికి నిర్దేశించిన 1.29 లక్షల హెక్టార్ల లక్ష్యానికి గాను, ఇప్పటివరకు 11,422 హెక్టార్లు అంటే 9 శాతం మాత్రమే సాధించామని మంత్రి తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల సాగును మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

Related News