​ఇంద్రకీలాద్రిపై శాకంబరీ మహోత్సవాలు

విజ‌య‌వాడ : ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న‌ జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో ప్రతి ఏటా అత్యంత వైభవంగా నిర్వహించే శాకంబ‌రీ ఉత్స‌వాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. ఈ ఉత్స‌వాలు ఈనెల 29వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతాయి. దేవస్థాన యంత్రాంగం భారీ ఎత్తున‌ ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ ఉత్సవాల వివరాలను వెల్లడించారు. ప్రకృతి స్వరూపిణి అయిన శ్రీ అమ్మవారికి ప్రకృతిలో లభించే వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు , పండ్లతో అలంకరించడమే శాకంబరీ ఉత్సవం అని పేర్కొన్నారు. భూలోకంలో సకాలంలో వర్షాలు కురిసి, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు , రైతాంగం సుఖ సంతోషాలతో జీవించాలని కాంక్షిస్తూ ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.

​ఈ ఉత్సవాలు 2007వ సంవత్సరంలో అప్పటి ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎస్.ఎస్. చంద్రశేఖర్ ఆజాద్ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. అప్పట్లో దేవస్థాన అర్చక బృందం వరంగల్ భద్రకాళీ ఆలయంలో జరిగే క్రతువులు, శాస్త్ర ప్రమాణాలను పరిశీలించిన అనంతరం ఇంద్రకీలాద్రిపై ఈ సంప్రదాయాన్ని ప్రారంభించిచారు. నాటి నుండి నేటి వరకు గత 19 సంవత్సరాలుగా దుర్గమ్మ సన్నిధిలో ఈ శాకంబరీదేవి పూజలు నిరంతరాయంగా, వైభవంగా సాగుతున్నాయి. ఈ ఏడాది ఎల్ నినో (El Niño) ప్రభావం వల్ల వర్షాలు లేక మార్కెట్‌లో కూరగాయల లభ్యత తక్కువగా ఉన్నప్పటికీ, దేవస్థాన సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వివిధ ప్రాంతాలకు వెళ్లి రైతులు, వ్యాపారుల నుండి విరాళాలు సేకరించారు. సుమారు 32 టన్నుల కూరగాయలు, ఆకుకూరలు ఇంద్రకీలాద్రికి చేరుకున్నాయి.

  • Related Posts

    విద్యార్థుల్లో ధర్మ, సంస్కార విలువల పెంపు

    తిరుపతి : హెచ్ డి పిపి, శ్రీ కాంచీ కామకోటి పీఠం సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 100 పాఠశాలల్లో విజయవంతమైన “ప్రజల వద్దకు ధర్మం” అనే దివ్య సంకల్పంతో విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం, నైతిక విలువలు, సాంప్రదాయ…

    శ్రీవారి పాదాల చెంత వేడుకగా ఛత్ర స్థాపనోత్సవం

    తిరుమల : తిరుమలలోని నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత ఛత్ర స్థాపనోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారి పాదాల వద్ద టిటిడి అర్చక బృందం ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్టించారు. ముందుగా తిరుమల శ్రీవారి ఆలయంలో రెండో గంట తర్వాత…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *