తిరుపతి : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 3వ తేదీన సోమవారం ఉదయం 10:00 గం||ల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ‘డయల్ యువర్ సిఎండి’ కార్యక్రమాన్ని ఏపీఎస్పీడీసీఎల్ నిర్వహించనుంది. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సిఎండి కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు మొబైల్ నంబరు: 8977716661కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను సిఎండి దృష్టికి తీసుకు రావచ్చు. ఈ కార్యక్రమం ద్వారా తమ విద్యుత్ సమస్యలను సిఎండి దృష్టికి తీసుకు రాదలచిన వినియోగదారులు తమ వద్ద విద్యుత్ సర్వీసు నంబరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.
డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి కార్యక్రమంతో పాటు సర్కిల్ స్థాయిలో కూడా ప్రతి సోమవారం ఉదయం 8:30 నుంచి 9:30 గం||ల వరకు ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లా స్థాయిలో తమ విద్యుత్ సమస్యలను సూపరింటెండింగ్ ఇంజనీర్ దృష్టికి తీసుకు వచ్చేందుకు వీలుగా వినియోగదారులు ఈ క్రింద పేర్కొన్న నంబర్లకు కాల్ చేయవచ్చు. తిరుపతి ఎస్ఈ 8712652679 , చిత్తూరు ఎస్ఈ 7993147979, నెల్లూరు ఎస్ఈ 08612320427, అన్నమయ్య ఎస్ఈ 9440817449, కడప ఎస్ఈ 08562242457 కర్నూల్ ఎస్ఈ 7382614308, నంద్యాల ఎస్ఈ 7382618976, అనంతపురం ఎస్ఈ 9154790350 శ్రీసత్యసాయి ఎస్ఈ 9490615721 సంప్రదించాలని సూచించారు.





