లాట‌రీ విధానంలో ఇందిర‌మ్మ‌ ఇళ్ల కేటాయింపు

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇందిర‌మ్మ హౌసింగ్ ట‌వ‌ర్స్ కోసం భారీ ఎత్తున ద‌ర‌ఖాస్తులు వ‌స్తున్నాయి. ఒకవైపు ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరిస్తూనే, మరోవైపు గృహాల కేటాయింపులు, నిర్మాణాలకు సంబంధించి హౌసింగ్ బోర్డు చర్యలు చేపడుతోంది. ఈ నెల 20వ తేదీ నుండి దరఖాస్తుదారులకు ఇళ్ల కేటాయింపు ప్రక్రియలో భాగంగా లాటరీ విధానాన్ని ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అంతే కాకుండా సంబంధిత ప్రాంతాలలో ‘ఇందిరమ్మ హౌసెస్ టవర్స్’ నిర్మాణ పనులను చేపట్టేందుకు టెండర్ ప్రక్రియను కూడా ప్రారంభించారు. ఈ ఇళ్లన్నింటినీ ఏడాదిలోగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు ఒక సమగ్ర ప్రణాళికను అమలు చేస్తున్నట్లు వైస్ చైర్మన్ వి.పి. గౌతమ్ వెల్లడించారు.

ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల‌లో వ‌చ్చిన ద‌ర‌ఖాస్తులు ఇలా ఉన్నాయి. ఖైరతాబాద్ – 4,394, అంబర్‌పేట్ – 2,357, బహదూర్‌పుర – 1,135, ఇబ్రహీంపట్నం – 749, కూకట్‌పల్లి – 5,233, కార్వాన్ – 1,574, మహేశ్వరం – 471, మలక్‌పేట్ – 2,846, మల్కాజ్‌గిరి – 1,033, మేడ్చల్ – 1,153, నాంపల్లి – 3,613, సనత్ నగర్ – 1,046, కుత్బుల్లాపూర్ – 4,121, రాజేంద్రనగర్ – 1,496, సికింద్రాబాద్ కంటోన్మెంట్ – 1,374, శేరిలింగంపల్లి – 2,530 మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు.ఇందిరమ్మ హౌసెస్ టవర్స్’కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి కాల్ సెంటర్ ఫోన్ నంబర్ 040-24603572ను సంప్రదించవచ్చని వైస్ చైర్మన్ సూచించారు.

  • Related Posts

    కొత్త త‌రం నేరాలపై దృష్టి సారించాలి : డీజీపీ

    జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా : తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ జిల్లాల ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. ఆయా జిల్లాలో పోలీస్ వ్య‌వ‌స్థ ప‌నితీరును ఆయ‌న ప్ర‌త్య‌క్షంగా ప‌రిశీలిస్తున్నారు. స‌మీక్ష‌లు చేప‌డుతూ కీల‌క సూచ‌న‌లు చేస్తున్నారు. తాజాగా డీజీపీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా…

    ప్ర‌తి ఒక్క‌రికీ ఓ విజ‌న్ ఉండాలి : చంద్ర‌బాబు నాయుడు

    విజ‌య‌వాడ : సమాజానికి ఏమిచ్చాం, దేశానికి ఏం చేశాం అన్నదే లక్ష్యంగా పని చేయాలి అని పిలుపునిచ్చారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఒకరు ప్రకృతి కోసం, మరొకరు పర్యావరణం కోసం, ఇంకోకరు నీటి సంరక్షణ కోసం పని చేయాలన్నారు. రాష్ట్రానికి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *