డీఆర్ఎఫ్‌ అసిస్టెంట్ల నియామకానికి భారీగా హాజరు

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో హైడ్రా దూకుడు పెంచింది. ఇప్పుడు అన్నీ తానై చూసుకుంటోంది. ఇందులో భాగంగా న‌గ‌రంలో ప‌లు ప‌నులు ప‌ర్య‌వేక్ష‌ణ చేసేందుకు గాను కొత్త‌గా సిబ్బందిని నియ‌మించాల‌ని నిర్ణ‌యించింది. ఇందులో భాగంగా హైడ్రాలో 100 మంది DRF అసిస్టెంటెంట్లతో పాటు 50 మంది డ్రైవర్ ఉద్యోగాల నియామకాన్ని హైడ్రా చేపట్టింది. సరూర్ న‌గ‌ర్ స్టేడియంలో ఎంపిక ప్రక్రియను హైడ్రా నిర్వహించింది. వేలాది మంది రావడంతో వారి నుంచి దరఖాస్తులు స్వీకరించడం, ఫిజికల్ టెస్టు కోసం టోకెన్లు జారీ చేయడంలో ఇబ్బంది తలెత్తింది. ఒకేసారి వేలాది మంది ముందుకు రావడానికి ప్రయత్నించగా వారిని నియంత్రించడంలో ఓ అధికారి అసహనానికి గురై పరుషంగా మాట్లాడడం తర్వాత సర్ది చెప్పడం జరిగింది.

యువత కూడా అర్థం చేసుకొని సహకరించడంతో ఎంపిక ప్రక్రియ సజావుగా సాగింది. ఈ నెల 8, 9 తేదీల్లో సరూర్ న‌గ‌ర్ స్టేడియంలో ఎంపిక ప్రక్రియ ఉంటుందని హైడ్రా ఇదివరకే మీడియా ద్వారా ప్రకటన ఇచ్చింది. దీంతో 3 వేల మందికి పైగా వచ్చారు. ఎలాంటి తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా పోలీసుల సహకారంతో అధికారులు నియంత్రించారు. మొదట్లో కాస్త ఇబ్బంది ఎదురైనా అందరి వద్ద దరఖాస్తులు స్వీకరిస్తామని, అందరికీ శారీరక పరీక్షలకు అవకాశం కల్పిస్తామని పదేపదే లౌడ్ స్పీకర్లలో అనౌన్స్ చేయడంతో యువత అర్థం చేసుకొని నియామక ప్రక్రియకు సహకరించింది.

  • Related Posts

    కొత్త త‌రం నేరాలపై దృష్టి సారించాలి : డీజీపీ

    జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా : తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ జిల్లాల ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. ఆయా జిల్లాలో పోలీస్ వ్య‌వ‌స్థ ప‌నితీరును ఆయ‌న ప్ర‌త్య‌క్షంగా ప‌రిశీలిస్తున్నారు. స‌మీక్ష‌లు చేప‌డుతూ కీల‌క సూచ‌న‌లు చేస్తున్నారు. తాజాగా డీజీపీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా…

    ప్ర‌తి ఒక్క‌రికీ ఓ విజ‌న్ ఉండాలి : చంద్ర‌బాబు నాయుడు

    విజ‌య‌వాడ : సమాజానికి ఏమిచ్చాం, దేశానికి ఏం చేశాం అన్నదే లక్ష్యంగా పని చేయాలి అని పిలుపునిచ్చారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఒకరు ప్రకృతి కోసం, మరొకరు పర్యావరణం కోసం, ఇంకోకరు నీటి సంరక్షణ కోసం పని చేయాలన్నారు. రాష్ట్రానికి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *