జార్ఖండ్ ఘ‌ట‌న‌పై రాహుల్ గాంధీ మౌన‌మేల‌..?

హైద‌రాబాద్ : తెలంగాణ భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్యక్షుడు ఎన్. రామ‌చంద‌ర్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఏఐసీసీ మాజీ చీఫ్‌, లోక్ స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీని ఏకి పారేశారు. ఇవాళ బీజేపీ చీఫ్ మీడియాతో మాట్లాడారు. జార్ఖండ్‌లో కాంగ్రెస్-జేఎంఎం (JMM) కూటమి ప్రభుత్వం అర్ధరాత్రి వేళ విద్యార్థులపై జరిపిన అమానుషమైన లాఠీచార్జ్ , పోలీసుల దాష్టీకం అత్యంత విషాదకరం అన్నారు. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు. ఒకవైపు రాహుల్ గాంధీ పార్లమెంటులో చర్చలకు దూరంగా ఉంటుండగా మరోవైపు జార్ఖండ్ విద్యార్థులపై జరిగిన ఈ దారుణమైన ఘటనపై పూర్తిగా మౌనం వహిస్తున్నారని ఆరోపించారు.

.ఇది ఆయన ద్వంద్వ వైఖరిని స్పష్టంగా బయట పెడుతోంద‌న్నారు ఎన్ .రామ‌చంద‌ర్ రావు. ఢిల్లీలో విద్యార్థుల నిరసనలను తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడానికి ప్రయత్నించిన రాహుల్ గాంధీకి, ఇప్పుడు జార్ఖండ్ యువత పడుతున్న బాధలు , వారి గొంతుకలు ఎందుకు కనిపించడం లేదంటూ నిప్పులు చెరిగారు. జార్ఖండ్ విద్యార్థులపై జరిగిన అమానుష దాడిని తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీని బాధ్యులను చేయాలని ఆయ‌న డిమాండ్ చేశారు. దేశం సమాధానాలను కోరుతోంది. రాహుల్ గాంధీ పార్లమెంటుకు వచ్చి తన ఈ ద్వంద్వ వైఖరిపై సమాధానం చెప్పాలని అన్నారు.

  • Related Posts

    మంత్రి ఆధ‌వ్ అర్జున్ పేరు చెప్పి టోక‌రా

    చెన్నై : టీవీకే మంత్రి ఆధవ్ అర్జునగా నటిస్తూ ఎమ్మెల్యే నుంచి రూ. 8 కోట్లు ఆశించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు చెన్నై పోలీసులు. మంత్రి పేరుతో నకిలీ ఈమెయిల్ ఐడిని సృష్టించి, తమళగ వెట్రి కళగం (TVK) వెల్లూరు ఎమ్మెల్యే…

    టీవీకే డీలిమిటేష‌న్ తీర్మానం ఒప్పుకోం : అన్నాడీఎంకే

    చెన్నై : అన్నాడీఎంకే చీఫ్ ప‌ళ‌నిస్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఆయ‌న చెన్నైలో మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన)పై TVK తీర్మానాన్ని అన్నాడీఎంకే పార్టీ వ్య‌తిరేకిస్తోంద‌ని చెప్పారు. మహిళలకు 33% రిజర్వేషన్‌కు AIADMK మద్దతు ఇస్తున్న‌ట్లు తెలిపారు. రాజకీయ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *