జై శ్రీ‌రామ్ పేరుతో దాడులు చేస్తే ఎలా..?

హైద‌రాబాద్ : న‌టి అన‌సూయ భ‌ర‌ద్వాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె తాజాగా హిందూ సంస్థ‌ల‌ను టార్గెట్ చేశారు. మ‌రో వివాదానికి తెర తీశారు. ప్ర‌స్తుతం దేశంలో హిందూ సంస్థ‌ల హ‌వా కొన‌సాగుతోంది. ‘జై శ్రీరామ్’ నినాదాలపై అనసూయ సంచలన వ్యాఖ్యలు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. జై శ్రీ‌రామ్ అనే వారిలో కొంద‌రు పెద్ద దొంగ‌లు ఉన్నారంటూ బాంబు పేల్చారు. జై శ్రీ‌రామ్ అనే గొడుగు త‌గిలించుకుని విచ‌క్ష‌ణ లేకుండా దాడుల‌కు పాల్ప‌డుతున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు అనూస‌య భ‌ర‌ద్వాజ్. కేవలం ‘జై శ్రీరామ్’ అనడం వల్ల విలువలు ఉన్నట్లు కాదన్నారు. నినాదాలు ముఖ్యం కాదని, వ్యక్తిగత ప్రవర్తనే ముఖ్యం అని స్ప‌స్టం చేశారు.

ముసుగులో ఉండి సనాతన ధర్మంపై దాడి చేయడం సరైనదేనా? అని నిప్పులు చెరిగారు అన‌సూయ భ‌ర‌ద్వాజ్. తాను కూడా శ్రీ‌రాముడిని పూజిస్తాన‌ని చెప్పారు. నా పెద్ద కొడుక్కి ఆంజ‌నేయ స్వామి (హ‌నుమంతుడి) పేరు పెట్టాన‌ని అన్నారు. కాగా తాజాగా అన‌సూయ చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి. సోష‌ల్ మీడియాను షేక్ చేశాయి. త‌ను చేసిన కామెంట్స్ పై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి. త‌మ‌ను అవ‌మానించ‌డం ప్ర‌తి ఒక్క‌రికీ ఫ్యాష‌న్ గా మారింద‌న్నారు. దీనిపై ఇంకో వీడియో విడుద‌ల చేశారు అన‌సూయ భ‌ర‌ద్వాజ్. త‌న వ్యాఖ్య‌ల తర్వాత దొంగ‌లంతా బ‌య‌ట‌కు వ‌స్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

  • Related Posts

    ఓటు తొల‌గింపుపై నిప్పులు చెరిగిన ప్ర‌కాశ్ రాజ్

    బెంగ‌ళూరు : ప్ర‌ముఖ విల‌క్ష‌ణ న‌టుడిగా గుర్తింపు పొందిన ప్ర‌కాష్ రాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి కేంద్ర స‌ర్కార్ పై, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాల‌పై భ‌గ్గుమ‌న్నారు. తాజాగా త‌న ఓటు…

    ఎన్నిక‌ల సంఘం తీరుపై ప్ర‌కాశ్ రాజ్ ఫైర్

    హైద‌రాబాద్ : విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఎన్నిక‌ల సంఘం తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న స్వ‌స్థ‌లం క‌ర్ణాట‌క అని, గ‌త కొన్నేళ్లుగా ఓటు వేస్తూ వ‌చ్చాన‌ని, తాను అక్క‌డే చ‌దువుకున్న విష‌యాన్ని తెలియ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *