క్షుద్ర పూజ‌లు చేస్తున్న మాజీ మంత్రులు : సీఎం

హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు బీఆర్ఎస్ నేత‌లు, మాజీ మంత్రుల‌పై. ఇప్ప‌టికే క్షుద్ర పూజ‌లు చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు చేయ‌డం, దీనిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు ఏకంగా కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులకు, పార్టీకి లీగ‌ల్ నోటీసులు కూడా పంపించారు. విచిత్రం ఏమిటంటే హ‌రీశ్ రావు క్షుద్ర పూజ‌లు చేయించాడ‌ని ఏకంగా బాధ్య‌త క‌లిగిన టీపీసీసీ చీఫ్‌, ఎమ్మెల్యే మ‌హేష్ కుమార్ గౌడ్ కూడా ఆరోపించారు. తాజాగా వీరికి వంత పాడుతూ సీఎం సంచ‌ల‌న కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. దశాబ్దాల పాటు మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి క్షుద్ర పూజలు చేయించుకుంటున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో కరువు రావాలని, రైతులు చని పోవాలని, ప్రభుత్వం కూలి పోవాలని కోరుకుంటూ వారు అర్ధరాత్రి భయంకరమైన పూజలు చేస్తున్నార‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు ఎ. రేవంత్ రెడ్డి. ఏ మనిషైనా ఇలాంటి పనులు చేస్తారా? అని ప్ర‌శ్నించారు. నా మీదో లేదా మహేష్ గౌడ్ మీదో లక్ష్యంగా చేసుకుని పూజలు చేయించుకుంటే మేము ఎదుర్కోగలమన్నారు. కానీ ప్రజలనే లక్ష్యంగా చేసుకుని పూజలు చేయించు కోవడం అంటే అర్థం ఏమిటి? అని నిల‌దీశారు సీఎం. తమ బాత్రూమ్ విశేషాలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు, మంచి పనుల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లి పూజలు చేసినప్పుడు వాటిని ఎందుకు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లేదంటూ మండిప‌డ్డారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *