మత్స్యకారుల గల్లంతైన ఘటనపై డిప్యూటీ సీఎం ఆరా

అమరావ‌తి : డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని ఓడలరేవుకు చెందిన మత్స్యకారుల బోటు సముద్రంలో గల్లంతైన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. బోటులో ఉన్న 8 మంది మత్స్యకారుల క్షేమంపై ఆరా తీశారు. సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సైతం ఇవాళ మ‌త్స్య‌కారుల గ‌ల్లంతుపై వాక‌బు చేశారు. స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మరం చేయాల‌ని ఆదేశించారు. ఈ నెల 3వ తేదీన ఓడలరేవు ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌ నుంచి బయలు దేరిన బోటు ఆగస్టు 13వ తేదీ నాటికి తిరిగి చేరుకోవాల్సి ఉండగా, ఇప్పటి వరకు బోటు ఆచూకీ లభించలేదు.

ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ జిల్లా కలెక్టర్, ఎస్పీల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గల్లంతైన బోటు కోసం ఇప్పటికే మెరైన్ పోలీసు, ఇండియన్ కోస్ట్ గార్డ్ సహకారంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. పోలీసు, రెవెన్యూ, మత్స్యశాఖలతోపాటు జిల్లా యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేసినట్లు చెప్పారు. మత్స్యకారుల ప్రాణల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ సూచించారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.

  • Related Posts

    తెలంగాణ వ్యాప్తంగా హైడ్రా కార్య‌క‌లాపాల విస్త‌ర‌ణ

    హైద‌రాబాద్ : వరద రహిత నగరాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో, పూడిక పేరుకుపోయిన చెరువులను పునరుద్ధరించేందుకు గాను హైడ్రాకు బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ రంగాల నిపుణులు తమ మద్దతును ప్రకటించారు. హైడ్రా కార్యకలాపాలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని, అలాగే చెరువులు…

    మత్స్యకారుల గల్లంతు ఘటనపై సీఎం ఆరా

    అమరావతి : బీ.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని ఓడలరేవు, దుమ్మలపేట, వాసలతిప్ప గ్రామానికి చెందిన మత్స్యకారుల బోటు సముద్రంలో గల్లంతైన ఘటనపై సీఎంఓ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. బోటులో ఉన్న ఎనిమిది మంది మత్స్యకారుల ఆచూకీ కోసం చేపడుతున్న…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *