ఇస్కాన్ చేస్తున్న సేవ‌లు ప్ర‌శంస‌నీయం : ఈట‌ల

హైద‌రాబాద్ : ఇష్కాన్ సంస్థ అందిస్తున్న సేవ‌లు ప్ర‌శంస‌నీయ‌మ‌ని అన్నారు ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన ఇస్కాన్ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. హరే కృష్ణ హరే కృష్ణ..
కృష్ణ కృష్ణ హరే హరే..ఇది ఇప్పుడు కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోందని చెప్పారు. ఒకప్పుడు భారతదేశాన్ని తక్కువగా చూసేవారు.. పాశ్చాత్య నాగరికతను గొప్పగా భావించేవారు. కానీ అమెరికా గడ్డపై ఈ సంస్థను స్థాపించిన గురువులకు లక్ష వందనాలు. వేలకొద్దీ కేంద్రాలు అభివృద్ధి చెంది, లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్నాయి. ఇదే మా జీవన విధానం అని మేము గర్వంగా చెప్పుకుంటాం.

భారతదేశం అంటేనే శాశ్వత ధర్మం , విశ్వాసానికి నిలయం. ఒకప్పుడు మన దేశం ప్రపంచ గురువుగా ఉండేది. ఆ స్థానాన్ని తిరిగి పొందేందుకు మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేయింబవళ్లు కృషి చేస్తున్నారు. ఈ రోజు మనం మాట్లాడుకునే ‘స్టార్ వార్స్’ (అంతరిక్ష యుద్ధాలు) , రాకెట్ సైన్స్ వంటివి మన మహాభారతం, రామాయణాల్లోనే అప్పుడే ప్రస్తావించ బడ్డాయి. అర్జునుడు యుద్ధం చేస్తున్నప్పుడు ప్రయోగించిన బాణాలు ఆనాటి సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలియజేస్తాయి. ఈ భూమిపై ఉన్న కోట్లాది జీవులలో, కేవలం మనిషి మాత్రమే స్పందించగలడు, మాట్లాడగలడు. మానవ జీవితాన్ని ఉన్నతంగా గడపాలని మన ధర్మం బోధించింది.

కలియుగంలో కూడా, మానవ సంబంధాల గొప్పతనాన్ని కాపాడగలిగేవి మన గురువుల ధర్మ బోధనలే.
ప్రపంచం అనేది మానవ సంబంధాల అల్లిక. అవసరంలో ఉన్నవారిని ఆదరించడమే దీని సారాంశం. దేశంలో మనం అనేక రకాల చెత్తను చూస్తున్నాం.వాటిని నిర్మూలించే శక్తి కేవలం ప్రభుత్వాల చేతుల్లోనే లేదు. ‘హరే కృష్ణ’ వంటి సంస్థలు వాటిని మార్చగలవు. అపారమైన జనాభా ఉన్నప్పటికీ, మన విశ్వాసం, జీవన విధానం కారణంగానే మన దేశం సగర్వంగా, ఆదర్శ ప్రాయంగా నిలుస్తోంది. దేశం అంటే కేవలం జీడీపీ (GDP), ఆర్థిక వ్యవస్థ లేదా మౌలిక సదుపాయాలు మాత్రమే కాదు. అది మానవ సంబంధాల సమాహారం అన్నారు ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్.

  • Related Posts

    శార‌దా పీఠం ఆధ్వ‌ర్యంలో సేవలకు గుర్తింపు

    హైద‌రాబాద్ : విశాఖ శారదా పీఠం వారి ఆధ్వర్యంలో దివ్య కార్యక్రమం” స్త్రీ శక్తి సనాతన శక్తి” అనే దివ్యమైన చర్చ కార్యక్రమం పూజ్య శారదాపీఠ స్వామీజీల ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ శుక్లా హాజ‌ర‌య్యారు. విశాఖ…

    సింహాచ‌లం స‌న్నిధిలో బీజేపీ చీఫ్ నితిన్ న‌బిన్

    విశాఖ‌ప‌ట్నం జిల్లా : విశాఖప‌ట్నం జిల్లా పర్యటనలో బిజీగా ఉన్నారు భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్య‌క్షుడు నితిన్ న‌బిన్. ఈ సంద‌ర్బంగా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా విశాఖపట్నం విచ్చేసిన భారతీయ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *