newsseals.com

అన్న ప్ర‌సాదం, ల‌డ్డు పోటు భ‌వ‌నాలు ప్రారంభం

August 21, 2026 · VijayaBhaskar

విజ‌య‌వాడ : ల‌క్ష‌లాది మంది భ‌క్తుల కొంగు బంగార‌మైన విజ‌య‌వాడ‌లోని శ్రీ క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యంలో
నూత‌నంగా , అత్యాధునిక వ‌స‌తి సౌక‌ర్యాల‌తో నిర్మించిన‌ అన్నప్రసాదం, లడ్డు పోటు భవనాల‌ను శుక్ర‌వారం ప్రారంభించారు రాష్ట్ర దేవాదాయ‌, ధ‌ర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయ‌ణ రెడ్డి. ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న ఈ ఆలయంలో . ₹52.50 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ సముదాయంలో, ఒకేసారి 800 మంది భోజనం చేసేలా భోజనశాల , 10,000 మందికి ఆహారాన్ని సిద్ధం చేసి వడ్డించగల సామర్థ్యం ఉన్న ఆధునిక వంటశాల ఉన్నాయి.

ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ భక్తులు, స్వచ్ఛంద సేవకుల కోసం నిర్మించిన ఈ భవనంలో ఒకేసారి 800 మంది భోజనం చేయవచ్చు అని చెప్పారు. ఇక్కడ ఉన్న యాంత్రీకరణతో కూడిన వంటశాలల ద్వారా ఒకేసారి 10,000 మందికి ఆహారాన్ని సిద్ధం చేసి వడ్డించే సదుపాయం ఉంది” అని అన్నారు. అలాగే, టిడిపి ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులతో మేము ఇక్కడ రెండు భవనాలను ప్రారంభించ‌డం అమ్మ వారి కృపేన‌ని పేర్కొన్నారు. ఒకటి అన్నప్రసాద భవనం కాగా, మరొకటి లడ్డు పోటు భవనం. ఈ రెండు భవనాలు యాత్రికుల కోసం ఉద్దేశించినవి అని తెలిపారు. వీటి నిర్మాణానికి సుమారు రూ. 50 కోట్లు ఖర్చు చేశార‌ని పేర్కొన్నారు.

Related News