రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న సీఎం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాలన సాగించడం లేదని ఫక్తు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు ఎంపీ ఈటల రాజేందర్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2005-06 లో కూకట్ పల్లిలో భూముల అమ్మకాలు మొదలు పెట్టారని పేర్కొన్నారు ఎంపీ. మలేషియా టౌన్షిప్ కు 36 ఎకరాలు, హిందూ ప్రాజెక్ట్ కు 70 ఎకరాలు, లోధాకు 18 ఎకరాలు, ఇండీస్ వన్ సిటీకి 12 ఎకరాలు అమ్మారన్నారు. వీరందరూ పెద్ద పెద్ద ఇల్లు కట్టి అమ్ముకోవడంతో పాటు పేదవారికి కూడా ఇల్లు కట్టి ఇవ్వాలి అనే నిబంధన ఉందన్నారు. ఒక మలేషియా టౌన్షిప్ మాత్రమే పేదలకు ఇళ్లను కట్టించి ఇచ్చారని, మిగతా నిర్మాణ సంస్థలు ఇవ్వలేదని ఆరోపించారు ఎంపీ.
ఈ భూములు అమ్మినప్పుడు వచ్చిన 1200 కోట్ల రూపాయలు హౌసింగ్ బోర్డ్ ఖాతాలో నిల్వ ఉన్నాయని, కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వాటిని తీసేసుకున్నాడని సీరియస్ కామెంట్స్ చేశారు. ఈ మధ్య గోద్రెజ్ కంపెనీకి 8 ఎకరాల భూమిని అమ్మారన్నారు. హౌసింగ్ బోర్డ్ చట్టం ప్రకారం పేదవారికి ఇళ్ళ జాగాలు ఇవ్వాలి తప్ప ఇలా అమ్ముకోవడానికి హక్కు లేదన్నారు ఈటల రాజేందర్. లక్ష 60 వేల బేస్ ప్రైజ్ పెట్టి ఈ భూములు అమ్ముకోవడానికి హౌసింగ్ బోర్డ్ ను వ్యాపార సంస్థగా మార్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ సంచలన ఆరోపణలు చేశారు ఎంపీ.
కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ లో ఖాళీ స్థలం లేకుండా చేస్తున్నారని, భూములు అమ్ముకొని జీతాలు ఇస్తున్నారు. ఇక్కడ స్థలము అమ్మ వద్దు చిన్న చిన్న చిల్డ్రన్ పార్కులుగా తయారు చేయాలన్నారు. అప్పట్లో ఈ ప్రాంత ఎమ్మెల్యే పి. జనార్దన్ రెడ్డి ఉన్నారు. ఆయనే హౌసింగ్ బోర్డు మంత్రిగా కూడా ఉన్నారు.. అప్పుడు ధర్మారెడ్డి హౌసింగ్ బోర్డ్ చైర్మన్ గా ఉన్నారు ఆ కాలంలో ఇలాంటివి జరగలేదన్నారు ఊర్లలో తాతల ఆస్తులు అమ్ముకుని తిరిగేవాన్ని తిరుగుబోతు అనేవారు. ఇప్పుడు రేవంత్ ఆస్తులు అమ్ముతున్నారని మండిపడ్డారు.ఆస్తులు అమ్మటం ఆపకపోతే దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు ఈటల రాజేందర్.