సీఎం జోసెఫ్ విజయ్ నిర్ణయం రైతులు సంతోషం
చెన్నై : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సంచలన ప్రకటన చేశారు. గతంలో ప్రకటించిన పరంధూర్ ఎయిర్ పోర్టు ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు శాసన సభ సాక్షిగా వెల్లడించారు. ఈ ప్రాజెక్టు చేపట్టడం వల్ల తమ విలువైన భూములు కోల్పోతామంటూ రైతులు, ప్రజలు గత కొన్నేళ్లుగా ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తూ వచ్చారు. కానీ డీఎంకే , అన్నాడీఎంకే ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దీనిపై పరంధూర్ విమానాశ్రయ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. చివరకు ప్రజా ప్రభుత్వం టీవీకే సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం స్పందించారు. ప్రజలకు, రైతులకు ఇబ్బంది కలిగించే ఏ ప్రాజెక్టును చేపట్టేది లేదని స్పష్టం చేశారు.
బాధితులు, ప్రజలు, రైతులకు తీపి కబురు చెప్పారు. పరంధూర్ ఎయిర్ పోర్టు ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఏ ఒక్కరి భూమిని తాము తీసుకోవడం లేదని తెలిపారు సీఎం. దీంతో పరంధూర్, ఏచంకరణై వంటి గ్రామాల స్థానిక ప్రజలలో ఎంతో ఆనందాన్ని నింపింది. మంగళవవారం ‘పరంధూర్ విమానాశ్రయ వ్యతిరేక పోరాట కమిటీ’ సభ్యులు సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ నాయకుడు ‘తమిళ ఎజుచ్చి తమిళన్’ (తమిళ చైతన్య ప్రదాత) ఎంపీ తోల్ తిరుమావళవన్‌తో కలిసి పోరాటంలో పాల్గొనడాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన మార్గదర్శకత్వంలో విమానాశ్రయ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రజలకు అండగా ముందు వరుసలో నిలవడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.