హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మూసీ ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెచ్ ఆర్ డి బోధి పెవిలియన్ లో మూసీ పైన సీఎం సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా కీలక సూచనలు చేశారు. తక్షణమే మూసీ ప్రాజెక్ట్ కోసం భూ సేకరణ ను వేగవంతం చేయాలని ఆదేశించారు. సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్ , HMDA కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, GHMC కమిషనర్ ఆర్.వి. కర్ణన్, మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సృజన , రంగా రెడ్డి జిల్లా నారాయణ రెడ్డి, మేడ్చల్ కలెక్టర్ మను చౌదరి, ఎంఆర్డీసీఎల్ ఎండీ ఈ.వి. నరసింహ రెడ్డి, ఎంఆర్డీసీఎల్ జేఎండీ గౌతమి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ల్యాండ్ పోలింగ్ పైన స్పష్టమైన విధానం రూపొందించు కోవాలని స్పష్టం చేశారు సీఎం. ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్, అసైన్డ్ భూముల సేకరణ పైన స్పష్టమైన విధానం తయారు చేసుకోవాలన్నారు . న్యాయపరమైన చిక్కులు రాకుండా చూడాలన్నారు . మూసీ ప్రాజెక్టు ఫేజ్ 2 కి వీలైనంత త్వరగా టెండర్ లు పిలవాలని ఆదేశించారు సీఎం. ప్రాజెక్ట్ లకు అతి తక్కువ వడ్డీ కి వచ్చే రుణాలపైన మునిసిపల్ కమిషనర్ లు దృష్టి పెట్టాలన్నారు. టీడీఆర్ పైన ప్రతి వారం సమీక్ష జరగాలన్నారు. మంచిరేవుల ఓంకారేశ్వర స్వామి ఆలయం టెండర్లు తక్షణం పిలవాలని పేర్కొన్నారు. కొత్వాల్ గూడా బర్డ్స్ పార్క్ కు మరింత ప్రచారం కల్పించాలన్నారు.





